రాష్ట్రంలోని వివిధ మెడికల్ కాలేజీల్లో నియామకాలకు (Jobs) సర్కార్ సిద్ధమైంది. 208 ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ ఉద్యోగాలను తత్కాలిక విధానంలో భర్తీ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు డీఎంఈ (TS DME) రమేష్ రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎంపికైన వారు ఏడాది పాటు పని చేయాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 9న నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరు కావాలని ప్రకటనలో పేర్కొన్నారు. ప్రొఫెసర్ గా ఎంపికైన వారికి నెలకు రూ.1.90 లక్షలు, అసోసియేట్ ప్రొఫెసర్ గా ఎంపికైన వారికి నెలకు రూ.1.50 లక్షల వేతనం చెల్లించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థులు ఈ నెల 19 నుంచి విధుల్లో చేరాల్సి ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నారు.
అధికారిక వెబ్ సైట్: https://dme.telangana.gov.in/
విద్యార్హతలు: అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టుల్లో MD/MS/DNB విద్యార్హత పొంది ఉండాలని ప్రకటనలో స్పష్టం చేశారు. దరఖాస్తుదారుల వయస్సు 69 ఏళ్లలోపు ఉండాలి. మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని ప్రకటనలో స్పష్టం చేశారు.
TSPSC Group-4 Notification: తెలంగాణ నిరుద్యోగులకు భారీ శుభవార్త.. 9,168 గ్రూప్-4 ఉద్యోగాలకు నోటిఫికేషన్
ఇదిలా ఉంటే.. తెలంగాణలో కొలువుల జాతర (Telangana Government Jobs) కొనసాగుతున్న విషయం తెలిసిందే. మొత్తం 80 వేల ఉద్యోగాల భర్తీని చేపట్టనున్నట్లు సీఎం కేసీఆర్ (CM KCR) ప్రకటించిన నేపథ్యంలో ఆ దిశగా కసరత్తును అధికార యంత్రంగం వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 3,897 కొత్త పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాష్ట్రంలోని 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, వాటి అనుబంధ ఆస్పత్రుల్లో ఈ ఖాళీలను (Jobs) భర్తీ చేయనుంది ప్రభుత్వం.
ఈ మేరకు వైద్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు (Minister Harish Rao) తన ట్విట్టర్ ఖాతా ద్వారా వివరాలను వెల్లడించారు.రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి , వికారాబాద్, ఖమ్మం , కరీంనగర్ , జయశంకర్ భూపాలపల్లి, కొమురం భీం ఆసిఫాబాద్, జనగాం, నిర్మల్ జిల్లాలోని మెడికల్ కాలేజీల్లో నియామకాలకు సంబంధించి ఈ అనుమతులు మంజూరు చేసినట్లు చెప్పారు. తద్వారా ఒక్కో మెడికల్ కాలేజీలో 433 చొప్పున నియామకాలను చేపట్టనున్నట్లు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: JOBS, Telangana government jobs