తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ శనివారం బీఆర్కేభవన్లో వైద్య, ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీచేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సీఎస్ సోమేష్‌కుమార్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక వసతులు, సదుపాయాలను బలోపేతం చేయాలని సూచించారు. బోధన, జిల్లా దవాఖానల్లో పీడియాట్రిక్ ఆక్సిజన్, ఐసీయూ పడకలను పెంచాలని సూచించారు. వ్యాక్సిన్ వేయించుకోని వారిని గుర్తించి, వ్యాక్సిన్లు వేసేందుకు మాప్ అప్ డ్రైవ్ నిర్వహించాలన్నారు. అన్ని ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటు, అదనపు అంతస్తుల నిర్మాణ పనులు పూర్తి చేయాలన్నారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, వ్యాక్సినేషన్ కోసం మిగిలిన వారందరినీ గుర్తించేందుకు ప్రత్యేకంగా మాప్ అప్ డ్రైవ్ నిర్వహించాలని సూచించారు.
అదేవిధంగా నీటిపారుదల, మిషన్ భగీరథ, ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ మొదలైన శాఖలు చేపట్టిన వివిధ అభివృద్ధి పనులపై సీఎస్ సోమేశ్‌కుమార్ సమీక్ష నిర్వహించారు. గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి(ఆర్ఐడీఎఫ్) ద్వారా రాష్ట్రంలో చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తిచేయాలని సీఎస్ ఆదేశించారు. నీటిపారుదల, మిషన్ భగీరథ, రోడ్లు, భవనాలు, పంచాయతీరాజ్ మొదలైన శాఖలు ఈ ప్రాజెక్టుల కింద చేపట్టిన పనులకు నాబార్డ్ విడుదల చేసిన నిధులను వెచ్చించాలన్నారు. ఇక, రాష్ట్రంలో ఇంటెన్సివ్ ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహించడానికి సులభంగా ఆర్థిక సహాయాన్ని పొందే అవకాశాలను అన్వేషించాలని వ్యవసాయశాఖ కార్యదర్శిని సీఎస్ సోమేశ్‌కుమార్ కోరారు.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.