హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

TS CPGET 2022 Results: నేడు తెలంగాణ CPGET ఫలితాలు.. ఫలితాలను చెక్ చేసుకోండిలా..

TS CPGET 2022 Results: నేడు తెలంగాణ CPGET ఫలితాలు.. ఫలితాలను చెక్ చేసుకోండిలా..

TS CPGET 2022 Results: నేడు తెలంగాణ CPGET ఫలితాలు.. ఫలితాలను చెక్ చేసుకోండిలా..

TS CPGET 2022 Results: నేడు తెలంగాణ CPGET ఫలితాలు.. ఫలితాలను చెక్ చేసుకోండిలా..

ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఎడ్యుకేషన్ బోర్డ్ TS PG ప్రవేశ పరీక్ష 2022ని నిర్వహించింది. తెలంగాణ స్టేట్ కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ (TS CPGET) ఆన్‌లైన్ దరఖాస్తులను 2022 జూన్ అండ్ జూలై నెలలో స్వకరించిన సంగతి తెలిసిందే.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఎడ్యుకేషన్ బోర్డ్ TS PG ప్రవేశ పరీక్ష 2022ని నిర్వహించింది. తెలంగాణ స్టేట్ కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ (TS CPGET) ఆన్‌లైన్ దరఖాస్తులను 2022 జూన్ అండ్ జూలై నెలలో స్వకరించిన సంగతి తెలిసిందే. ఇటీవల TS CPGET పరీక్షలను 11 ఆగస్టు నుండి 23 ఆగస్టు 2022 వరకు నిర్వహించారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఫలితాలపై ఎలాంటి సమాచారం రాలేదు. తాజాగా ఈ ఫలితాలను సెప్టెంబర్ 20వ తేదీన విడుదల చేయనున్నట్లు సమాచారం. మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి ఈ ఫలితాలు విడుదల చేయనున్నారు. ఓయూ (Osmania University) నిర్వహించిన CPGET– 2022లో 45 సబ్జెక్టులకు 67,115 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 57లకు పైగా విద్యార్థులు ఈ పరీక్షలు రాసినట్లు తెలిపారు.

Telangana New Posts: నిరుద్యోగులకు శుభవార్త.. మరో 2670 కొత్త పోస్టులు మంజూరు..

ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు ఓయూతో పాటు కాకతీయ, పాలమూరు, శాతా వాహన, జేఎన్టీయూ, మహాత్మాగాంధీ వర్సిటీ, తెలంగాణ యూనివ్సిటీ, తెలంగాణ మహిళా వంటి వర్సీటీల్లో పీజీ కోర్సులతో పాటు డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నట్లు స్పష్టంచేశారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు https://cpget.tsche.ac.in/వెబ్‌సైట్‌ ద్వారా ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. ఈ సారి ఫలితాల్లో అర్హత సాధించిన మహిళలకు మహిళా యూనివర్సిటీలో కూడా అడ్మిషన్స్ పొందే అవకాశం ఉంది.

ఫలితాలను ఇలా చెక్ చేసుకోవచ్చు..

-ముందుగా అధికారిక వెబ్ సైట్ను సందర్శించాలి.

-సీపీ గెట్ రిజల్ట్స్ పై క్లిక్ చేయాలి.

-అభ్యర్థులు లాగిన్ ఐడీ మరియు పాస్ వర్డ్ ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

-మరో విండో ఓపెన్ అవుతుంది. దీనిలో మీ ఫలితాలను చూసుకోవచ్చు.

-చివరగా మీరు అర్హత సాధిస్తే కార్డును ప్రింట్ తీసుకొని.. భవిష్యత్ అవసరాలకు భద్రంగా మీ వద్దే ఉంచుకోవాలి.

Hyderabad Jobs: హైదరాబాద్ TVVP ఆసుపత్రిలో ఉద్యోగాలు .. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక..

త్వరలో నీట్ కౌన్సెలింగ్..

దేశంలోనిప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో సీట్ల భర్తీ కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీనీట్-యూజీ‌‌ పరీక్షను నిర్వహిస్తుంది. ఈ ఏడాది సంబంధించిన నీట్ పరీక్ష జులై 17న జరగ్గా, ఫలితాలు ఇటీవల వెల్లడయ్యాయి. ఈ స్కోర్ ఆధారంగా మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ ప్రభుత్వ కళాశాలల్లోని 15% ఆల్ ఇండియా కోటా(AIQ) సీట్లు, డీమ్డ్ సెంట్రల్/యూనివర్సిటీలు, ESIC/AFMS, AIIMS, JIPMER, బీఎస్సీ నర్సింగ్ ప్రోగ్రామ్‌ల కోసం 100 శాతం సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహించనుంది. నీట్-2022లో ఉత్తీర్ణతసాధించిన వారు ఎంసీసీ వెబ్ సైట్ mcc.nic.in ద్వారా కౌన్సెలింగ్ షెడ్యూల్‌‌కు సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చు. నీట్ కౌన్సెలింగ్ ఆన్‌లైన్‌లో జరగనుంది. ఈ ప్రక్రియ చేపట్టే స్టేట్ లెవల్ అథారిటీస్‌తో పాటు NIRF ర్యాంకింగ్ ప్రకారం టాప్ 20 మెడికల్ కాలేజీల లిస్ట్ చెక్ చేద్దాం.

Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, JOBS, Results

ఉత్తమ కథలు