తెలంగాణలో డిగ్రీ, పీజీ పరీక్షలపై క్లారిటీ.. వారికి మాత్రమే..

మిగిలిన సెమిస్టర్‌ విద్యార్థులకు పరీక్షలు లేకుండానే తాత్కాలికంగా ప్రమోట్‌ చేయాలని.. ప్రాజెక్టులు, సెమినార్లు, వైవాలు ఆన్‌లైన్‌లోనే నిర్వహించాలని స్పష్టం చేసింది.

news18-telugu
Updated: May 29, 2020, 7:52 PM IST
తెలంగాణలో డిగ్రీ, పీజీ పరీక్షలపై క్లారిటీ.. వారికి మాత్రమే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా-లాక్‌డౌన్ నేపథ్యంలో విద్యా సంస్థలన్నీ మూతపడడంతో పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. ఈ క్రమంలో తెలంగాణలో వాయిదా పడిన డిగ్రీ, పీజీ పరీక్షల నిర్వహణపై రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి మార్గదర్శకాలు జారీ చేసింది. తుది సెమిస్టర్‌ పరీక్షలు మాత్రమే నిర్వహించాలని సూచించింది. డిగ్రీ, పీజీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు జూన్‌ 20 నుంచి పరీక్షలు నిర్వహించవచ్చని యూనివర్సిటీలకు అనుమతి ఇచ్చింది. మిగతా సెమిస్టర్లకు నవంబర్‌ లేదా డిసెంబర్‌లో పరీక్షలు నిర్వహించాలని తెలిపింది. అటు పరీక్షా సమయాన్ని రెండు గంటలకు కుదించాలని చెప్పిన రాష్ట్ర ఉన్నత విద్యామండలి.. ప్రశ్నాపత్రంలోనూ ఎక్కువ ఆప్షన్స్ ఇవ్వాలని సూచించింది. మిగిలిన సెమిస్టర్‌ విద్యార్థులకు పరీక్షలు లేకుండానే తాత్కాలికంగా ప్రమోట్‌ చేయాలని.. ప్రాజెక్టులు, సెమినార్లు, వైవాలు ఆన్‌లైన్‌లోనే నిర్వహించాలని స్పష్టం చేసింది.
Published by: Shiva Kumar Addula
First published: May 29, 2020, 7:52 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading