Telangana Government Jobs: తెలంగాణలోని నిరుద్యోగులకు అలర్ట్.. ఉద్యోగాల భర్తీపై సీఎం కేసీఆర్ నిర్ణయం అప్పుడే..

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

తెలంగాణలో ఉద్యోగాల భర్తీపై కొన్నాళ్లుగా నిరుద్యోగులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. అయితే, నిన్న నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలోనూ ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రాకపోవడంతో వారిలో నిరాశ వ్యక్తమవుతోంది.

  • Share this:
    తెలంగాణ రాష్ట్రంలో 50 వేల ఉద్యోగాలను త్వరలో భర్తీ చేయనున్నట్లు సీఎం కేసీఆర్ కొన్ని నెలల కింద ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అప్పటి నుంచి నిరుద్యోగులు ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే గత నెల 13, 14 తేదీల్లో నిర్వహించిన కేబినెట్ సమావేశం సందర్భంగా ఉద్యోగాల భర్తీపై స్పష్టమైన ప్రకటన వస్తుందని అంతా భావించారు. కానీ ఆ సమయంలో సర్కార్ నుంచి ఎలాంటి స్పష్టమైన ప్రకటన రాకపోవడంతో నిరుద్యోగుల్లో తీవ్ర నిరాశ వ్యక్తమైంది. 50 వేల ఉద్యోగాల భర్తీ కోసం ఖాళీలను పక్కాగా గుర్తించి సమగ్ర నివేదిక ఇవ్వాలని సీఎం కేసీఆర్ అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. దీంతో అన్ని శాఖల మంత్రులు అధికారులతో సమీక్షలు నిర్వహించి ఖాళీల లెక్కలకు సంబంధించిన నివేదికను ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ కు పంపించారు. ఖాళీలు, ప్రమోషన్లతో మిగిలిన పోస్టులతో పాటు ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు పోస్టుల వివరాలతో కలిపి 60 నుంచి 70 వేలకు పైగా ఖాళీలు ఉన్నట్లు ఆర్థిక శాఖ నివేదికను తయారు చేసింది. ఆ వివరాలను అధికారులు మంత్రివర్గ సమావేశానికి సైతం అందించారు.
    TMREIS Recruitment 2021: తెలంగాణ మైనార్టీ కాలేజీల్లో 840 జూనియర్ లెక్చరర్ పోస్టులు... ఖాళీల వివరాలు ఇవే
    Telangana Jobs: తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. ఆ శాఖలో 1100 పోస్టుల భర్తీకి తొలగిన అడ్డంకులు.. వివరాలివే..

    అయితే ఈ ఖాళీలపై మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారని.. అనంతరం వెంటనే నోటిఫికేషన్లు విడుదల అవుతాయని నిరుద్యోగులు భావించారు. కానీ నిన్న జరిగిన మంత్రి వర్గ సమావేశంలో ఉద్యోగాల ఖాళీలపై ఎలాంటి చర్చ జరగకపోవడంతో వారిలో తీవ్రంగా నిరాశ వ్యక్తమైంది. అయితే.. 60 వేల ఖాళీలు ఉన్నట్లు అధికారులు సమర్పించిన జాబితాను అధ్యాయనం చేస్తామని సీఎం కేసీఆర్ సమావేశంలో అన్నట్లు తెలిసింది. వచ్చే మంత్రి వర్గ సమావేశంలో ఈ ఖాళీల భర్తీపై ప్రత్యేకంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీఎం కేసీఆర్ వెల్లడించినట్లు ప్రగతి భవన్ వర్గాలు వెల్లడించారు. దీంతో మళ్లీ నిర్వహించే మంత్రివర్గ సమావేశంలో కేవలం ఉద్యోగాల భర్తీపైనే పూర్తి స్థాయిలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

    కేంద్రం ప్రవేశ పెట్టిన ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లపైనా కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రూ.8లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్‌ కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో ఆర్థికంగా వెనకబడిన తరగతులు (EWS)కు గరిష్ఠ వయోపరిమితిలో ఐదేళ్లు సడలింపు ఇస్తామని తెలిపింది.
    Published by:Nikhil Kumar S
    First published: