Home /News /jobs /

TELANGANA CM KCR MAY ANNOUNCE PRC TO EMPLOYEES ON MARCH 22 HERE FULL DETAILS NS

Telangana PRC: తెలంగాణ ఉద్యోగులకు శుభవార్త.. పీఆర్సీ ప్రకటనకు ముహూర్తం ఖరారు..

సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్

ఉద్యోగుల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతున్న పీఆర్సీ అంశానికి త్వరలో ముగింపు పలికేందుకు సీఎం కేసీఆర్ సిద్ధమయ్యారు. ఈ నెల 22న కేసీఆర్ స్వయంగా ఉద్యోగులకు వేతన సవరణపై గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...
    దాదాపు రెండున్నరేళ్లుగా తెలంగాణ ఉద్యోగులకు ఊరిస్తున్న వేతన సవరణ అంశంపై కీలక ప్రకటన చేసేందుకు సీఎం కేసీఆర్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో ఈ నెల 22న సీఎం కేసీఆర్ స్వయంగా ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు సమాచారం. వేతన సవరణతో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకం(CGHS) మాదిరిగానే తెలంగాణ ఉద్యోగులకు అందిస్తున్న ఈహెచ్ఎస్, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ తదితర అంశాలపై సైతం సీఎం ప్రకటన చేయనున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు సీఎం కేసీఆర్ ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమైన విషయం తెలిసిందే.  ఆ సమయంలో ఏపీలో అమలవుతున్న మధ్యంతర భృతి(ఐఆర్) కన్నా కనీసం రెండు శాతం ఎక్కువే ఫిట్మెంట్ ఇస్తామని సీఎం హామీ ఇచ్చారని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు.

    దీంతో 29 శాతం ఫిట్మెంట్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో పాటు ఉద్యోగుల వయోపరిమితి పెంపు అంశంపై సైతం సీఎం హామీ ఇచ్చినట్లు ఉద్యోగ సంఘాలు తెలిపాయి. దీంతో ఈ నెల 22న ఆయా ఈ అంశాలపై సీఎం నుంచి రానున్న అధికారిక ప్రకటన కోసం ఉద్యోగులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవల ప్రవేశ పెట్టిన బడ్జెట్లో ఆర్థిక శాఖకు చేసిన కేటాయింపుల్లో రూ. 8 వేల కోట్లను ప్రత్యేకంగా చూపారు. అయితే ఈ నిధులను పీఆర్సీ కోసమే ప్రత్యేకంగా చూపారన్న చర్చ జోరుగా సాగుతోంది.

    ఆర్థిక, ప్రణాళిక శాఖకు బడ్జెట్లో రూ. 45,923 కోట్లను నిర్దేశించారు. అయితే రూ. 8 వేల కోట్లను మాత్రం నిర్వహణ పద్దు కింద చూపారు. అయితే ఈ నిధులను పీఆర్సీ కేసమే కేటాయిస్తారన్న చర్చ జోరుగా సాగుతోంది.  పీఆర్సీపై సీఎం కేసీఆర్ ప్రకటన అనంతరం ఆ నిధులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులు పదవీ విరణమ వయస్సును 58 ఏళ్ల నుంచి 61 ఏళ్లకు పెంచితే మరో రూ.3 వేల కోట్ల వరకు ఆయా ఉద్యోగులకు అందించే రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించడం వాయిదా పడుతుంది. ఆ మొత్తాన్ని పీఆర్సీ కోసం వినియోగించే అవకాశం ఉంది.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: CM KCR, Telangana, Telangana employees

    తదుపరి వార్తలు