TELANGANA CM KCR MAY ANNOUNCE FITMENT TO GOVERNMENT EMPLOYEES IN ONE OR TWO DAYS NS
Telangana PRC: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. పీఆర్సీపై ప్రకటనకు సర్వం సిద్ధం.. పూర్తి వివరాలివే..
సీఎం కేసీఆర్(ఫైల్ ఫోటో)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పేందుకు సర్కార్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఏ క్షణమైనా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(Telangana CM KCR) ఉద్యోగుల వేతనాల పెంపుపై ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పేందుకు సర్కార్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఉద్యోగులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్న జీతాల పెంపు ప్రక్రియ కొలిక్కి వచ్చినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఏ క్షణమైనా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఉద్యోగుల వేతనాల పెంపుపై ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఉద్యోగ సంఘాలు సైతం ఈ అంశంపై నమ్మకం వ్యక్తం చేస్తున్నాయి. ఒక వేళ ఆలస్యమైనా ఈ నెలాఖరుకు ఖచ్చితంగా సీఎం కేసీఆర్ నుంచి ప్రకటన రావడం ఖాయమని ఆయా సంఘాల నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఫిట్మెంట్ కూడా సంతృప్తికరంగా ఉంటుందని వారు తమను కలిసిన ఉద్యోగులకు చెబుతున్నారు.
50 వేల మందికి పదోన్నతులు
ఇప్పటికే పదోన్నతులకు సంబంధించి సర్వీసును కుదిస్తూ సర్కార్ జీవో విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రభుత్వ నిర్ణయం ద్వారా మొత్తం 50 వేల మంది ఉద్యోగులకు పదోన్నతులు లభిస్తాయని ఉద్యోగ సంఘాల నేతలు అంచనా వేస్తున్నారు. దీని ద్వారా ఉద్యోగుల ప్రధాన డిమాండ్ అయిన ప్రమోషన్లు నెరవేరుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక మిగిలిన ఫిట్మెంట్, పదవీ విరమణ వయస్సు పెంపుపై సైతం త్వరలోనే ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం వస్తుందని వారు చెబుతున్నారు.
ఈ నెలాఖరులోగా పీఆర్సీ..
టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ నిన్న మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ను ఒప్పించి ఈ నెలాఖరు వరకు 11వ పీఆర్సీని ఇప్పిస్తామని అన్నారు. ఈ విషయమై ఉద్యోగులు ఆందోళన చెందొద్దని అన్నారు. అనవసరంగా తొందరపడి కొన్ని సంఘాలు ధర్నాలకు పిలుపునివ్వడం సరికాదన్నారు.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.