Home /News /jobs /

TELANGANA CM KCR KEY DECISION OVER POLICE JOBS AGE RELAXATION HERE FULL DETAILS NS

TS Police Jobs: నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ శుభవార్త.. పోలీస్ జాబ్స్‌కు మరో రెండేళ్ల వయో పరిమితి పెంపు.. దరఖాస్తు గడువు కూడా పెంపు?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణలోని నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ (CM KCR) శుభవార్త చెప్పారు. వయో పరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తక్షణ చర్యలు చేపట్టాలని సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డిని సీఎం ఆదేశించారు.

    తెలంగాణలోని నిరుద్యోగులకు కేసీఆర్ సర్కార్ (Telangana Government) మరో శుభవార్త చెప్పింది. పోలీస్ ఉద్యోగాలకు (Telangana Police Jobs) సంబంధించి ఇప్పటికే మూడేళ్ల పాటు వయో పరిమితిలో సడలింపు ఇచ్చిన ప్రభుత్వం.. మరో రెండేళ్ల పాటు సడలింపు ఇస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎం కేసీఆర్ (CM KCR) నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 95 శాతం స్థానికత మొదటిసారిగా అమలులోకి రావడంతో పాటు, రెండేళ్ల పాటు కరోనా కారణంగా నోటిఫికేషన్లు విడుదల కాలేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ యువతీ యువకులకు వయోపరిమితిని పెంచాలని, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి చేసిన విజ్ఞప్తికి సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఇందుకు సంబంధించి తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, డీజీపీని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.

    అయితే.. తెలంగాణ పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ ను ఈ నెల 2న తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ప్రారంభించింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 20 అంటే ఈ రోజు లాస్ట్ డేట్ గా నిర్ణయించారు. నియామక ప్రక్రియ ప్రారంభానికి కొన్ని రోజుల ముందే వయో పరిమితిని మూడేళ్ల పాటు పెంచుతున్నట్లు కేసీఆర్ సర్కార్ ఆదేశాలను జారీ చేసింది. అయితే.. మరో రెండళ్ల పాటు వయో పరిమితిని పెంచాలని నిరుద్యోగులకు చాలా రోజులుగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. కరోనా కారణంగా రెండేళ్ల పాటు నష్టపోయామని.. అంతకు ముందు రెండేళ్లలో కూడా నోటిఫికేషన్లు విడుదల కాలేదని వారు ప్రభుత్వం దృష్టికి పలుమార్లు తీసుకువెళ్లారు.
    Telangana Jobs: నిరుద్యోగులకు అలర్ట్... 17,291 పోస్టులకు ఈరోజే లాస్ట్ డేట్... వెంటనే అప్లై చేయండి

    ఈ అంశంపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని సర్కార్ కు విన్నవించారు. అయితే.. నిన్నటి వరకు కూడా ఈ అంశంపై ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో ఇక వయో పరిమితి పెంపు ఉండకపోవచ్చని అంతా భావించారు. తాజాగా సీఎం కేసీఆర్ పోలీస్ జాబ్స్ కు సంబంధించి వయో పరిమితిని మరో రెండేళ్ల పాటు పెంచుతూ నిర్ణయం తీసుకోకపోవడంతో నిరుద్యోగుల నుంచి హర్షం వ్యక్తం అవుతోంది. సీఎం తాజా ఆదేశాలతో మరో 4 లక్షల అప్లికేషన్లు వచ్చే అవకాశం ఉందని అంచనా.
    TSPSC Group-4 Notification: తెలంగాణ నిరుద్యోగులకు అలర్ట్.. అతి త్వరలోనే 9,168 పోస్టులతో గ్రూప్-4 నోటిఫికేషన్.. ఎప్పుడంటే?

    దరఖాస్తు గడువు పెంచుతారా?
    పోలీస్ ఉద్యోగాలకు వయో పరిమితిని మరో రెండేళ్లు పెంచిన నేపథ్యంలో దరఖాస్తు గడువును మరి కొన్ని రోజుల పాటు పొడిగించాలని నిరుద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ రోజు దరఖాస్తులకు చివరి రోజు కావడంతో సాయంత్రం వరకు కావాల్సిన అన్ని ధ్రువపత్రాలను సిద్ధం చేసుకుని అప్లై చేయడం కష్టమని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో దరఖాస్తు గడువును పొడిగించాలని వారు కోరుతున్నారు. దరఖాస్తు గడువును పొడిగించకపోతే.. ప్రభుత్వం వయో పరిమితిని పెంచి కూడా తమకు ప్రయోజనం లేకుండా పోతుందని ఇప్పటి వయో పరిమితి కారణంగా అప్లై చేసుకోలేకపోయిన నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

    అయితే.. వయో పరిమితిని పెంచిన నేపథ్యంలో దరఖాస్తు గడువును కూడా పొడిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ అధికారులు ఈ రోజు సమావేశమై ఈ అంశంపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమచారం. వారి సమావేశం ముగిసిన అనంతరం వయోపరిమితి పెంపు, దరఖాస్తు గడువు పెంపు అంశాలపై అధికారిక ఆదేశాలు జారీ కానున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Telangana government jobs, Telangana police jobs, TS Police

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు