హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

CM KCR: ఐటీ రంగంలో 16.5 లక్షల ఉద్యోగాలు.. అన్ని రంగాల్లో అద్భుత ప్రగతి: సీఎం కేసీఆర్

CM KCR: ఐటీ రంగంలో 16.5 లక్షల ఉద్యోగాలు.. అన్ని రంగాల్లో అద్భుత ప్రగతి: సీఎం కేసీఆర్

మాట్లాడుతున్న సీఎం కేసీఆర్

మాట్లాడుతున్న సీఎం కేసీఆర్

ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలుస్తోందని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం వేడుకల్లో సీఎం ప్రసంగించారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad | Vijayawada

  తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం వేడుకలు (Telangana’s 75th National Integration Day) రాష్ట్ర వ్యాప్తంగా వైభవంగా సాగుతున్నాయి. వేడుకల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) పాల్గొన్నారు. హైదరాబాద్ పబ్లిక్‌ గార్డెన్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. దేశ, రాష్ట్ర ప్రజలకు తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల శుభాకాంక్షలు తెలియజేశారు. 1948వ సంవత్సరం సెప్టెంబర్ 17న తెలంగాణ (Telangana) సువిశాల భారతదేశంలో అంతర్భాగంగా మారింది. రాచరిక పరిపాలన నుంచి ప్రజాస్వామ్య దశలోకి పరివర్తన చెందింది. అందుకే ఈ సందర్భంగా జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నామన్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని ఈ సందర్భంగా సీఎం అన్నారు.సుస్థిర పాలన, మెరుగైన శాంతిభద్రతలు, అవినీతికి, అలసత్వానికి ఆస్కారంలేని విధంగా రూపొందించిన టీఎస్-ఐపాస్ పారిశ్రామిక విధానం, ఈ మూడింటి వల్ల తెలంగాణకు పెట్టుబడులు (Telangana Investments) వెల్లువెత్తుతున్నాయని సీఎం అన్నారు.

  పారిశ్రామిక రంగంలో ఈ ఎనిమిదేళ్లలో 2 లక్షల 32 వేల 111 కోట్ల రూపాయల పెట్టుబడులు తరలివచ్చాయన్నారు. 16 లక్షల 50 వేల ఉద్యోగాల కల్పన జరిగిందని వివరించారు. ఐటీ రంగంలో తెలంగాణ సాటిలేని ప్రగతిని సాధిస్తూ రాష్ట్రం పురోగమిస్తున్నదన్నారు. 2014లో తెలంగాణ ఐటీరంగ ఎగుమతుల విలువ 57 వేల 258 కోట్లు మాత్రమే ఉండగా, తెలంగాణ ప్రభుత్వ కృషితో 2021 నాటికి 1 లక్షా 83 వేల 569 కోట్లకు పెరిగిందని సీఎం సంతోషం వ్యక్తం చేశారు. ఐటీ రంగ ఎగుమతుల్లో దేశం వృద్ధిరేటు 17.20 మాత్రమే ఉండగా, తెలంగాణ వృద్ధి రేటు 26.14 శాతంగా ఉండటం మన రాష్ట్ర ప్రతిష్టను ఇనుమడింప చేస్తోందన్నారు.

  KCR | Telangana : రాష్ట్రంలో దుష్టశక్తులు చొరబడ్డాయి .. ప్రజల్ని విభజించే విచ్చిన్నకర శక్తులతో జాగ్రత్త : కేసీఆర్

  గురుకుల ఆవాసీయ విద్యలో దేశంలో తెలంగాణదే అగ్రస్థానం అని అన్నారు. 1,011 గురుకుల విద్యాలయాలున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. ఈ గురుకులాల్లో ఐదున్నర లక్షల మంది విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యాబోధన జరుగుతోందన్నారు. గురుకులాల్లో చదివే ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం ప్రతిఏటా 1 లక్షా 25 వేల రూపాయలు ఖర్చు చేస్తోందన్నారు. ప్రశాంతమైన, సురక్షితమైన, ప్రగతిశీల వాతావరణం ఉన్నచోటనే పారిశ్రామిక అభివృద్ధి పరుగులు తీస్తుందన్నారు. అందుకు నిజమైన నిదర్శనం మన తెలంగాణ రాష్ట్రం అన్నారు.

  వైద్య ఆరోగ్యరంగంలో తెలంగాణ అద్భుతమైన ప్రగతి సాధించింది. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసే యజ్ఞం కొనసాగుతున్నది. రాష్ట్రంలో తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ – టిమ్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరం నలువైపులా నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులతోపాటు, వరంగల్ నగరంలో మరొక సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రభుత్వం నిర్మిస్తున్నది.

  హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్లో మరో 2 వేల పడకలను ప్రభుత్వం అదనంగా అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. వీటితోపాటు పేద ప్రజల కోసం ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాలు - పల్లె దవాఖానాలు చక్కని సేవలందిస్తున్నాయి.

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: CM KCR, IT jobs, JOBS, Telangana, Ts gurukula

  ఉత్తమ కథలు