Home /News /jobs /

TELANGANA CM KCR KEY ANNOUNCEMENT OVER JOBS RECRUITMENT AND DEVELOPMENT IN TELANGANA NS

Telangana Government Jobs: తెలంగాణ యువతకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు.. ఉద్యోగాల భర్తీపై కీలక ప్రకటన

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

‘‘ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవం” (world youth skills day) నేపథ్యంలో సీఎం కేసీఆర్(CM KCR) కీలక ప్రకటన చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.

    తెలంగాణలో ఉద్యోగాల భర్తీ విషయంలో నిరుద్యోగులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఈ సమయంలో సీఎం కేసీఆర్ మరోసారి కీలక ప్రకటన చేశారు. ‘‘ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవం” (world youth skills day) సందర్భంగా తెలంగాణ యువతకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ప్రకనట విడుదల చేశారు. పరిశ్రమలు, ఐటీ రంగంలో లక్షలాది మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను ప్రభుత్వం కల్పించిందని సీఎం అన్నారు. ప్రభుత్వ రంగంలో ఇప్పటికే 1 లక్షా ముప్పై వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చామన్నారు. నూతన జోన్ల ఆమోదం తర్వాత జోన్లలో క్లారిటీ రావడంతో మరో యాభై వేల ఉద్యోగాల కోసం కార్యాచరణ ప్రారంభమైందని సీఎం స్పష్టం చేవారు. భవిష్యత్ లో జాబ్ క్యాలెండర్ ద్వారా ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నామని సీఎం స్పష్టం చేశారు. గ్రామీణ, పట్టణ యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పనే ధ్యేయంగా ఏడేండ్లుగా అమలు పరుస్తున్న ప్రభుత్వ కార్యాచరణ కొలిక్కివచ్చిందని సీఎం అన్నారు. పునర్నిర్మితమైన తెలంగాణ స్వరాష్ట్ర ఫలాలను యువతీ యువకులు అనుభవించే పరిస్థితులు నేడు తెలంగాణ వ్యాప్తంగా నెలకొన్నాయని సీఎం అన్నారు.

    పలు పథకాల ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశామన్నారు. తద్వారా గ్రామీణ యువతకు ఉపాధి కల్పన పెరుగుతోందన్నారు. పట్టణాల్లో ఉపాధి రంగాలను మెరుగుపరిచే కార్యక్రమాలను అమలు చేస్తూ వాటి ఫలాలను యువతకు అందించే స్థాయికి చేరుకున్నామన్నారు. సంపదను సృష్టించి దాన్ని ప్రజలకు పంచడం అనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తున్నదన్నారు. దండుగన్న వ్యవసాయం నేడు పండుగలా మారిందన్నారు. వ్యవసాయ రంగం నేటి యువతను కూడా ఆకర్షిస్తుండడం వెనక తెలంగాణ ప్రభుత్వ శ్రమ ఎంతో ఉందని సీఎం అన్నారు. పారిశ్రామిక, వాణిజ్యం, ఐటీ రంగాలు సహా వ్యవసాయం దాని అనుబంధ రంగాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నయని సీఎం అన్నారు.

    ఈ నేపథ్యంలో లక్షలాదిగా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన జరుగుతుందన్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని సీఎం అన్నారు. మారిన కాలమాన పరిస్థితుల్లో యువత మరింత సమర్థవంతంగా తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని సీఎం సూచించారు. తెలంగాణ యువత ఎంతో సమర్థవంతమైందని కొనియాడారు. వారికి నైపుణ్యాలు తోడయితే తిరుగులేని యువశక్తిగా అవతరిస్తుందని సీఎం అన్నారు. యువతలో నైపుణ్యాల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తున్నదని సీఎం అన్నారు.

    ఐటీ సాంకేతిక రంగాల్లో ఉద్యోగాలు లభించే దిశగా తెలంగాణ నైపుణ్య పరిజ్జాన అకాడెమీ (టాస్క్)ని దేశంలోనే తొలిసారి ఏర్పాటు చేశామన్నారు. తద్వారా గ్రాడ్యుయేషన్ పూర్తిచేసుకున్న యువతీ యువకులకు సాంకేతిక, సాంకేతికేతర పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టుగా నైపుణ్య శిక్షణను అందిస్తున్నామన్నారు. యువతను ప్రోత్సహించేలా ఐటీ పాలసీని రూపొందించామన్నారు. ప్రత్యేకంగా టీ సాట్ ద్వారా నిరుద్యోగ యువతకు వివిధ స్థాయిల్లో అవగాహనతో పాటు శిక్షణాకార్యక్రమాలను అందిస్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: CM KCR, Job notification, JOBS, Telangana, Telangana government jobs, Telangana jobs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు