HOME »NEWS »JOBS & EDUCATION »telangana chief secretary somesh kumar meets employees unions for to discuss over prc on january 27 ns

Telangana PRC: తెలంగాణలో పీఆర్సీపై జోరుగా సాగుతున్న కసరత్తు.. ఉద్యోగ సంఘాలతో సీఎస్ సమావేశం తేదీ ఖరారు

Telangana PRC: తెలంగాణలో పీఆర్సీపై జోరుగా సాగుతున్న కసరత్తు.. ఉద్యోగ సంఘాలతో సీఎస్ సమావేశం తేదీ ఖరారు
సీఎం కేసీఆర్(ఫైల్ ఫోటో)

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల కమిటీ (PRC) సోమవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో సమావేశం నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
    తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల కమిటీ (PRC) సోమవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పీఆర్సీ నివేదికతో పాటు, వివిధ ఉద్యోగ సంఘాలతో చర్చలు జరుపుటకు నిర్ణయం, తదితర అంశాలపై చర్చించారు. వేతన సవరణ నివేదికతో పాటు ఉద్యోగులకు సంబంధించిన కాలానుగుణ పదోన్నతులు, ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పొడిగింపు తదితర అంశాలపై కమిటీ సభ్యులు చర్చించారు. దీనికి సంబంధించి వివిధ ఉద్యోగ సంఘాలతో సమావేశాల షెడ్యూల్ ను కూడా రూపొందించారు.  ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు, నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రజత్ కుమార్ పాల్గొన్నారు. జనవరి 27న పీఆర్సీపై చర్చించడానికి ఉద్యోగ సంఘాలతో సీఎస్ చర్చించనున్నారు.

    ఇదిలా ఉంటే.. తెలంగాణ రాష్ట్రంలోని మొదటి పీఆర్సీలో సీపీఎస్ ఉద్యోగులకు న్యాయం చేయాలని సీపీఎస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు స్థితప్రజ్ఞ ప్రభుత్వాన్ని కోరారు. సీఎం ఆదేశించిన విధంగా ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలపై చీఫ్ సెక్రెటరీ సోమేశ్ కుమార్ ఆధ్యర్యంలో ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ తో పీఆర్సీ, ప్రమోషన్లు, ఇతర సమస్యల పై చర్చించి పరిష్కరించాలన్న ప్రకటన ఆనందదాయకం అని అన్నారు.



    తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 1,50,000 సీపీఎస్ ఉద్యోగుల పెన్షన్ సమస్య విధానం పై చర్చించడానికి తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయిస్ యూనియన్ కు అవకాశం ఇవ్వాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ , ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్ కోశాధికారి నరేష్ గౌడ్ విజ్ఞప్తి చేశారు.  గతంలో ఉమ్మడి ఆంద్ర ప్రదేశ్ లో పీఆరసీ కమిటీల్లో సీపీఎస్ విధానం పై సరియైన న్యాయం జరగలేదన్నారు. ఇతర రాష్ట్రాల్లో సీపీఎస్ ఉద్యోగులకు అమలు చేస్తున్నట్లు ఫ్యామిలీ పెన్షన్ ను 1972 పెన్షన్ రూల్స్ ప్రకారం అమలు చేయాలని డిమాండ్ చేశారు.
    Published by:Nikhil Kumar S
    First published:January 25, 2021, 20:10 IST

    टॉप स्टोरीज