Telangana Students: విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకుంటున్న తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. కీలక ఆదేశాలు.. పూర్తి వివరాలివే
Telangana Students: విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకుంటున్న తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. కీలక ఆదేశాలు.. పూర్తి వివరాలివే
సమీక్ష నిర్వహిస్తున్న సోమేశ్ కుమార్
రాష్ట్రంలోని యువతకు విదేశాలలో మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించడానికి తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ ఈ రోజు బి.ఆర్.కె.ఆర్ భవన్లో అధికారులతో సమావేశమై చర్చించారు.
రాష్ట్రంలోని యువతకు విదేశాలలో మరిన్ని ఉపాధి అవకాశాలు (Jobs) కల్పించడానికి తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ (CS Somesh Kumar) ఈ రోజు బి.ఆర్.కె.ఆర్ భవన్లో అధికారులతో సమావేశమై చర్చించారు. శిక్షణ మరియు సామర్థ్యాన్ని పెంపొందించడం, విదేశాలలో ఉద్యోగ మార్కెట్‌ను మెరుగుపరచుటకు తెలంగాణ ఓవర్ సీస్ మ్యాన్ పవర్ కంపెనికి (TOMCOM) ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్, అడ్వైజరీ కౌన్సిల్ ను ఏర్పాటు చేయడంపై దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకత ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు. విదేశాల్లో ఎక్కువ మంది నర్సింగ్ విద్యార్థులు (Nursing Students) పరీక్షలు రాసేందుకు వీలుగా వ్యూహాన్ని రూపొందించాలని వైద్యారోగ్య శాఖ అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కోరారు.
ప్రభుత్వ, ప్రయివేటు కళాశాలల్లో నర్సింగ్ కోర్సు చదువుతున్న విద్యార్థులందరికీ మోటివేషనల్ క్యాంపులు నిర్వహించి విదేశాల్లో ఉద్యోగావకాశాల గురించి వివరించాలని ఆదేశించారు. అదేవిధంగా ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్న టెక్నికల్ కోర్సుల జాబితాను షార్ట్ లిస్ట్ రూపొందించాలన్నారు.
విద్యార్థులకు ప్రాథమిక పాఠ్యాంశాలతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంగ్లీషులో బోధించేందుకు కోర్సులతో పాటు రిసోర్స్ పర్సన్లను గుర్తించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారులను ఆదేశించారు. అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలలో మౌలిక సదుపాయాలను వినియోగించుకోవడంతో పాటు బలోపేతం చేయాలని తెలిపారు.
ఈ సమావేశంలో కార్మిక, ఉపాది శిక్షణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీమతి రాణి కుముదిని, ఐ.టి. శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, సాంకేతిక విద్యాశాఖ కమీషనర్ నవీన్ మిట్టల్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్.ఏ.ఎం రిజ్వీ, పంచాయితీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, CM OSD డా.గంగాధర్, కార్మిక శాఖ కమీషనర్ అహ్మద్ నదీమ్, ఇండస్ట్రీస్ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ రమేశ్ రెడ్డి, నిమ్స్ డైరెక్టర్ మనోహర్, టాస్క్ సీఈవో శ్రీకాంత్ సిన్హా ఇతర అధికారులు పాల్గొన్నారు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.