హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Telangana Jobs: తెలంగాణ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ లో జాబ్స్.. దరఖాస్తుకు మరికొన్ని గంటలే ఛాన్స్.. ఇలా అప్లై చేసుకోండి

Telangana Jobs: తెలంగాణ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ లో జాబ్స్.. దరఖాస్తుకు మరికొన్ని గంటలే ఛాన్స్.. ఇలా అప్లై చేసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణ ప్రభుత్వానికి చెందిన హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. జావా-సాఫ్ట్‌వేర్ డెవలపర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటన చేసింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

తెలంగాణ ప్రభుత్వానికి (Telangana) చెందిన హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (Centre For Good Governance) ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. జావా-సాఫ్ట్‌వేర్ డెవలపర్ (Java-Software Developer) పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటన చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని సూచించింది. జావా డవలపెర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు అధికారులు. అయితే ఎన్ని ఖాళీలు ఉన్నాయన్న విషయాన్ని మాత్రం ప్రకటనలో పేర్కొనలేదు. దరఖాస్తుకు ఈ నెల 30ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

TSPSC Group-4 Notification: తెలంగాణలో కొలువుల పండుగ.. 9,168 గ్రూప్-4 ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్

విద్యార్హతల వివరాలు:

- బీఈ/బీటెక్(కంప్యూటర్ సైన్స్/ఎలక్ట్రానిక్స్/ఐటీ) ఎంసీఏ విద్యార్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. (లేదా)

- ఎంటెక్/ఎంఈ/ఎంఎస్ (కంప్యూటర్ సైన్స్/ఐటీ/ఎలక్ట్రానిక్స్) (లేదా)

- బీఎస్సీ (కంప్యూటర్), బ్యాచలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (లేదా)

ఎంఎస్సీ (కంప్యూటర్ సైన్స్)

- మాస్టర్ డిగ్రీ (కంప్యూటర్ సైన్స్ లో పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమాతో పాటు ఫిజిక్స్/మాథ్స్/స్టాటిస్టిక్స్/ఎలక్ట్రానిక్స్ )

అనుభవం: సాఫ్ట్వేర్ డవలప్మెంట్ లో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలని ప్రకటనలో పేర్కొన్నారు.

అభ్యర్థులు ఈ లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నారు.

First published:

Tags: JOBS, State Government Jobs, Telangana government jobs

ఉత్తమ కథలు