Home /News /jobs /

TELANGANA CABINET ORDERS FOR RECRUITMENT OF 5111 ANGANWADI JOBS VACANCIES NS

Telangana Govt Jobs: తెలంగాణలో మరో 5,111 ఉద్యోగాల భర్తీకి కేబినెట్ ఆమోదం.. వెంటనే భర్తీ చేయాలని నిర్ణయం

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫొటో)

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫొటో)

తెలంగాణలోని సీఎం కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    తెలంగాణలోని సీఎం కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. తెలంగాణలో ఖాళీగా ఉన్న 5,111 అంగన్ వాడీ టీచర్లు, ఆయా పోస్టులను (Anganwadi Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ రోజు నిర్వహించిన మంత్రింర్గ సమావేశంలో ఈ ఉద్యోగాల భర్తీకి ఆమోదం లభించింది. ఈ ఉద్యోగాలను (Telangana Government Jobs) వెంటనే భర్తీ చేయాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇంకా కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి 15 ఆగస్టు నుంచి రాష్ట్రంలో కొత్తగా 10 లక్షల పెన్షన్లు మంజూరు చేస్తూ తెలంగాణ మంత్రివర్గం (Telangana Cabinet Decisions) నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న 36 లక్షల పెన్షన్లకు అదనంగా 10 లక్షల కొత్త పెన్షన్లు ఇవ్వాలని తీర్మానించింది. దీంతో మొత్తంగా కొత్తవి, పాతవి కలిపి 46 లక్షల పెన్షన్దారులకు (Aasara Pensions) కార్డులు మంజూరు చేయనున్నారు.

    దీంతో పాటు స్వాతంత్య్ర దినోత్సవ వజ్రోత్సవాల సందర్భంగా 75 మంది ఖైదీల విడుదలకు నిర్ణయం తీసుకున్నారు. ఇక కోఠి ఈఎన్.టి. ఆస్పత్రికి 10 మంది స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టులు మంజూరు చేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. సరోజినీ దేవి కంటి దావాఖానలో కూడా అధునాతన సౌకర్యాలతో కూడిన నూతన భవన సముదాయం నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించింది. కోఠిలోని వైద్యారోగ్యశాఖ సముదాయంలో కూడా ఒక అధునాతన ఆస్పత్రి నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది.
    No Helmet-No Petrol Rule: తెలంగాణ వాహనదారులకు అలర్ట్.. హెల్మెట్ లేని వారికి బంకుల్లో నో పెట్రోల్.. ఆగస్టు 15 నుంచి అక్కడ కొత్త రూల్


    ఇంకా.. గ్రామకంఠంలో నూతన ఇళ్ల నిర్మాణానికి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అధికారులతో ఒక కమిటీ వేసి, 15 రోజుల్లోగా ఒక నివేదిక ఇచ్చి, సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. వికారాబాద్ లో ఆటోనగర్ నిర్మాణానికి 15 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. తాండూరు మార్కెట్ కమిటీకి యాలాలలో 30 ఎకరాల ఎకరాల స్థలాన్ని కేటాయించింది. షాబాద్‌లో షాబాదు బండల పాలిషింగ్ యూనిట్లను ఏర్పాటు చేయడానికి టీఎస్ ఐఐసీ ఆధ్వర్యంలో స్థలాల కేటాయింపునకు 45 ఎకరాలను కేటాయిస్తూ తీర్మానం చేసింది.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: CM KCR, JOBS, Telangana government jobs

    తదుపరి వార్తలు