హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Telangana New Police Jobs: గుడ్ న్యూస్.. తెలంగాణలో మరో 4000 పోలీస్ ఉద్యోగాలు..

Telangana New Police Jobs: గుడ్ న్యూస్.. తెలంగాణలో మరో 4000 పోలీస్ ఉద్యోగాలు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణలో వరుస నోటిఫికేషన్లు విడుదల అవున్నాయి. వీటితో పాటు.. ఖాళీ పోస్టులకు సంబంధించి ఆర్థిక శాఖ నుంచి కూడా అనుమతులు లభిస్తున్నాయి. తాజాగా పోలీస్ శాఖలో మరో 4000 కొత్త పోస్టుల భర్తీకి తెలంగాణ మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

తెలంగాణలో వరుస నోటిఫికేషన్లు(Notifications) విడుదల అవున్నాయి. వీటితో పాటు.. ఖాళీ పోస్టులకు సంబంధించి ఆర్థిక శాఖ నుంచి కూడా అనుమతులు లభిస్తున్నాయి. తాజాగా పోలీస్ శాఖలో మరో 4000 కొత్త పోస్టుల భర్తీకి తెలంగాణ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనిలో సైబర్ సేఫ్టీ బ్యూరో పరిధిలో ఉన్న ఈ పోస్టులను త్వరలో భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర హోంశాఖను కేబినెట్ ఆదేశించింది. దీంతో పాటు.. కొత్త పోలీస్ స్టేషన్లు, కొత్త సర్కిళ్ల డివిజన్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. డ్రగ్స్(Drugs) నేరాల నియంత్రణకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇక కొత్తగా ఆమోదం లభించిన ఈ 4వేల పోస్టుల్లో 3966 పోస్టులు త్వరగా భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

రాష్ట్ర పోలీసు శాఖలో నూతన ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు క్యాబినేట్ ఆమోదం తెలిపింది. శాంతిభద్రతల పరిరక్షణలో దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ రాష్ట్రంలో పోలీసు శాఖను మరింత పటిష్టం చేయాలని క్యాబినేట్ నిర్ణయించింది. పెరుగుతున్న సాంకేతికత, మారుతున్న సామాజిక పరిస్థితులలో, నేరాల తీరు కూడా మారుతున్న నేపథ్యంలో నేరాల అదుపునకు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలనీ, అందుకు అనుగుణంగా సిబ్బందిని నియమించుకోవాలని క్యాబినేట్ నిర్ణయించింది.

TSPSC Merit List: అభ్యర్థులకు అలర్ట్.. 9368 మందితో మెరిట్ లిస్ట్ విడుదల చేసిన TSPSC..

నార్కోటిక్ డ్రగ్స్, గంజాయి తదితర మాదక ద్రవ్యాలు యువత భవిష్యత్ ను దెబ్బతీస్తూ శాంతిభద్రతల సమస్యగా పరిణమిస్తున్నాయనీ, క్యాబినేట్ చర్చించింది. డ్రగ్స్ నేరాలను అరికట్టి నిర్మూలించేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పోలీసు శాఖలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా హైదరాబాద్ , సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లు, కమాండ్ కంట్రోల్ సెంటర్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో మరియు తెలంగాణ సైబర్ సేఫ్టీ బ్యూరో పరిధిలో 3,966 పోస్టులను వివిధ కేటగిరీలలో భర్తీ చేయాలని క్యాబినేట్ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి నియామక ప్రక్రియ చర్యలు చేపట్టాలని రాష్ట్ర హోంశాఖను క్యాబినేట్ ఆదేశించింది.

TSPSC Junior Lecturer Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. TSPSC నుంచి జేఎల్(JL) నోటిఫికేషన్ జారీ..

 వీటితోపాటు..

హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో.. శాంతిభద్రతలను మరింతగా మెరుగు పరిచేందుకు, పోలీసు వ్యవస్థను మరింత పటిష్టం చేయడానికి, నూతన పోలీస్ స్టేషన్లు, నూతన సర్కిల్ లు, నూతన డివిజన్ల ఏర్పాటుకు క్యాబినేట్ ఆమోదం తెలిపింది.

First published:

Tags: JOBS, Police jobs, Tslprb

ఉత్తమ కథలు