TELANGANA BRAHMIN SAMKSHEMA PARISHAD OFFERS FREE COACHING TO GROUP 1 AND POLICE JOBS NS
Telangana Jobs Free Coaching: తెలంగాణలోని నిరుద్యోగులకు అలర్ట్.. వారికి ఫ్రీగా కోచింగ్.. వివరాలివే
ప్రతీకాత్మక చిత్రం
తెలంగాణలో వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న బ్రాహ్మణ అభ్యర్థులకు బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ శుభవార్త చెప్పింది. వారికి ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
తెలంగాణలో వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న బ్రాహ్మణ అభ్యర్థులకు బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ శుభవార్త చెప్పింది. వారికి ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ డాక్టర్ రమణాచారి ప్రకటన చేశారు. ఆ అభ్యర్థులకు మే 16 నుంచి ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్టు వెల్లడించారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని స్టడీ సెంటర్లలోనే బ్రాహ్మణ అభ్యర్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లు వివరించారు. బొగ్గులకుంటలోని దేవాదాయశాఖ కార్యాలయంలో ఆయన ఈ వివరాలను వెల్లడించారు. అభ్యర్థులు ఈ నెల 1వ తేదీ నుంచి www.brahminparishad.telangana.gov.in వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవాలని రమణాచారి సూచించారు. ఒక్కో కేటగిరి నుంచి వంద మందిని ఎంపిక చేయనున్నట్లు వెల్లడించారు. అంతకుమించి అభ్యర్థులు ఉంటే అదనపు బ్యాచ్లు చేపట్టాలని నిర్ణయించినట్లు వివరించారు.
పోలీస్ జాబ్స్ కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఫిజికల్ టెస్టులకు సంబంధించిన కోచింగ్ ను సైతం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఇంకా.. కోచింగ్, స్టడీ మెటీరియల్ సైతం ఆన్లైన్, ఆఫ్లైన్ పద్ధతుల్లో అందించనున్నట్లు ఆయన వివరించారు. ఎంపికైన గ్రూప్ 1 అభ్యర్థులకు ఉపకార వేతనం ప్రతీ నెల 5000, ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారికి నెలకు రూ. 2 వేల వరకు స్కాలర్ షిప్ అందించనున్నారు. TS Police Jobs Alert: పోలీస్ జాబ్స్ కు అప్లై చేస్తున్నారా? ఈ 6 జాగ్రత్తలు తప్పనిసరి అన్న బోర్డు.. తెలుసుకోండి
ముఖ్యమైన తేదీలు: దరఖాస్తులు: మే 1 నుంచి 7 వరకు అభ్యర్థుల స్క్రీనింగ్ : 8 నుంచి 15 వరకు అభ్యర్థులకు కోచింగ్: 16వ తేదీ నుంచి..
ఎలా అప్లై చేయాలంటే.. Step 1:అభ్యర్థులు మొదటగా అధికారిక వెబ్ సైట్ www.brahminparishad.telangana.gov.in ను ఓపెన్ చేయాలి. Step 2:అనంతరం Financial AID for coaching to the job aspirants లింక్ పై క్లిక్ చేయాలి. Step 3:అనంతరం రిజిస్ట్రేషన్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. Step 4:తర్వాత ఆధార్ నంబర్ ను నమోదు చేసి సబ్మిట్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. Step 5:అనంతరం కావాల్సిన వివరాలను నమోదు చేసి దరఖాస్తు చేసుకోవాలి.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.