Home /News /jobs /

TELANGANA BRAHMIN SAMKSHEMA PARISHAD OFFERS FREE COACHING TELANGANA GOVERNMENT JOBS ASPIRANTS HERE APPLICATION PROCESS NS

TS Jobs Free Coaching: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వారికి శుభవార్త.. ఫ్రీగా కోచింగ్.. ఇలా దరఖాస్తు చేసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణలో వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకు (Telangana Government Jobs) ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఫ్రీగా శిక్షణ ఇవ్వనున్నట్లు బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ప్రకటించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    తెలంగాణలో వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకు (Telangana Government Jobs) ప్రిపేర్ అవుతున్న బ్రాహ్మణ అభ్యర్థులకు బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ శుభవార్త చెప్పింది. వారికి ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్‌ డాక్టర్‌ రమణాచారి ప్రకటన చేశారు. ఆ అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్టు వెల్లడించారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని స్టడీ సెంటర్లలోనే బ్రాహ్మణ అభ్యర్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లు వివరించారు. అభ్యర్థులు ఈ నెల 1వ తేదీ నుంచి www.brahminparishad.telangana.gov.in వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవాలని రమణాచారి సూచించారు. ఒక్కో కేటగిరి నుంచి వంద మందిని ఎంపిక చేయనున్నట్లు వెల్లడించారు. అంతకుమించి అభ్యర్థులు ఉంటే అదనపు బ్యాచ్‌లు చేపట్టాలని నిర్ణయించినట్లు వివరించారు. అప్లై చేసుకోవడానికి మొదటగా ఈ నెల 7ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. తాజాగా దరఖాస్తు గడువును ఈ నెల 12కు పొడిగించారు అధికారులు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

    పోలీస్ జాబ్స్ (TS Police Jobs) కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఫిజికల్ టెస్టులకు సంబంధించిన కోచింగ్ ను సైతం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఇంకా.. కోచింగ్‌, స్టడీ మెటీరియల్‌ సైతం ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ పద్ధతుల్లో అందించనున్నట్లు ఆయన వివరించారు. ఎంపికైన గ్రూప్ 1 అభ్యర్థులకు ఉపకార వేతనం ప్రతీ నెల 5000, ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారికి నెలకు రూ. 2 వేల వరకు స్కాలర్ షిప్ అందించనున్నారు.
    TS Police Jobs: తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త.. పోలీస్ జాబ్స్ విషయంలో మరో కీలక నిర్ణయం?

    ముఖ్యమైన తేదీలు:
    దరఖాస్తులు: మే 1 నుంచి 12 వరకు
    అభ్యర్థులకు కోచింగ్‌: 16వ తేదీ నుంచి ప్రారంభం అవుతుందని తొలుత ప్రకటించారు. అయితే.. దరఖాస్తు గడువు పొడిగించిన నేపథ్యంలో ఈ తేదీ మారే అవకాశం ఉంది. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

    ఎలా అప్లై చేయాలంటే..
    Step 1: అభ్యర్థులు మొదటగా అధికారిక వెబ్ సైట్ www.brahminparishad.telangana.gov.in ను ఓపెన్ చేయాలి.
    Step 2: అనంతరం Financial AID for coaching to the job aspirants లింక్ పై క్లిక్ చేయాలి.
    Step 3: అనంతరం రిజిస్ట్రేషన్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
    Step 4: తర్వాత ఆధార్ నంబర్ ను నమోదు చేసి సబ్మిట్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
    Step 5: అనంతరం కావాల్సిన వివరాలను నమోదు చేసి దరఖాస్తు చేసుకోవాలి.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Job notification, JOBS, Telangana government jobs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు