TELANGANA BOARD OF INTERMEDIATE EDUCATION TO LAUNCH YOUTUBE CHANNEL FOR INTER STUDENTS SS
Intermediate: ఇంటర్ విద్యార్థులకు శుభవార్త... యూట్యూబ్ ఛానెల్ ద్వారా పాఠాలు
ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు.
Intermediate Exams | ఇంటర్ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఓ యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించబోతోంది తెలంగాణ ఇంటర్ బోర్డు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ యూట్యూబ్ ఛానెల్ అందుబాటులోకి రానుంది.
తెలంగాణలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు శుభవార్త. ఇంటర్ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించబోతోంది ఇంటర్ బోర్డు. వేర్వేరు సబ్జెక్టుల్లో నిపుణులతో యూట్యూబ్ ఛానెల్ ద్వారా పాఠాలు అందించనుంది. ఇప్పటికే చాలావరకు పాఠ్యాంశాలను రికార్డ్ చేశారు. వాటిలో తప్పుల్ని సరిదిద్దే బాధ్యతను థర్డ్ పార్టీకి అప్పగించింది ఇంటర్ బోర్డు. వీడియో లెస్సన్స్‌ని తయారు చేసేందుకు ప్రత్యేకంగా ఓ విభాగాన్ని ఏర్పాటు చేయడం విశేషం. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్-NCERT అధికారులతో చర్చించి పాఠ్యాంశాలను రూపొందిస్తోంది. ఇప్పటికే టీశాట్ ఛానెల్ ద్వారా వీడియో పాఠాలు ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. ఇంటర్ విద్యార్థులకు యూట్యూబ్ ఛానెల్ ద్వారా వీడియో పాఠాలు అందించేందుకు టీశాట్ సహకారం కూడా తీసుకుంటోంది ఇంటర్ బోర్డు.
ఇంటర్ విద్యార్థుల కోసం రూపొందిస్తున్న యూట్యూబ్ ఛానెల్ 2020-21 విద్యా సంవత్సరంలో అందుబాటులోకి రానుంది. యూట్యూబ్ ఛానెల్ ద్వారా పాఠాలు అందుబాటులోకి వస్తే... విద్యార్థులు ఇంటర్మీడియట్ సబ్జెక్టుల్లోని పాఠాలను ఎప్పుడు కావాలంటే అప్పుడు చూడటానికి వీలవుతుంది. క్లాసులకు వెళ్లలేని విద్యార్థులు కూడా యూట్యూబ్ వీడియోల ద్వారా పాఠాలను నేర్చుకోవచ్చు. కాలేజీలో విన్న పాఠాలను యూట్యూబ్‌లో రివిజన్ చేసుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.