Home /News /jobs /

TELANGANA BHADRADRI DISTRICT STUDENT GOT JOB WITH 2 CRORES RUPEES PER YEAR SALARY PACKAGE NS KMM

Telangana Student: ఏటా రెండు కోట్ల జీతం.. అమెరికాలో ఔరా అనిపించిన తెలంగాణ ఏజెన్సీ విద్యార్థి.. వివరాలివే

అభిరాంరెడ్డి

అభిరాంరెడ్డి

కొడితే ఏనుగు కుంభ స్థలాన్నే కొట్టాలన్నట్లు ఏకంగా ఏటా రెండు కోట్ల జీతంతో జాబ్‌ (Job) సంపాధించాడు ఉమ్మడి ఖమ్మం జిల్లా కుర్రోడు. సైంటిస్ట్‌గా ప్రతిష్టాత్మక ఇంటెల్‌లో జాయిన్‌ అయ్యాడు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Kothagudem
    (G.SrinivasReddy, News18, Khammam)
    అతనో సాధారణ యువకుడు. మధ్య తరగతి కుటుంబం నుంచి ఎదిగాడు. సాధారణ ప్రభుత్వ పాఠశాలల్లోనే (Government School) చదివాడు. గ్రాడ్యుయేషన్‌ తర్వాత అందరిలా ఆలోచించలేదు. చిన్నచితకా జాబ్స్‌కు (Jobs) ఆశపడలేదు. కొడితే ఏనుగు కుంభ స్థలాన్నే కొట్టాలన్నట్టు.. ఏకంగా ఏటా రెండు కోట్ల జీతంతో జాబ్‌ సంపాధించాడు. సైంటిస్ట్‌గా ప్రతిష్టాత్మక ఇంటెల్‌లో జాయిన్‌ అయ్యాడు. భద్రాద్రి (Bhadradri Kothagudem) జిల్లా నుంచి ఎదిగిన ఈ యువకుడు ఇప్పుడు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. తనకు ఏం కావాలో.. ఎలా సెటిల్‌ అవ్వాలో ఖచ్చితంగా తెలిసిన యువకుడు కనుకనే ఎన్ని ఆఫర్లు వచ్చినా.. తాను ఏస్థాయిలో జాబ్‌ చేయాలన్న దానిపై పిచ్చ క్లారిటీతో ముందుకెళ్లాడు. ఈ యూత్‌ ఐకాన్‌.. అంతర్జాతీయంగా ప్రతిష్టాత్మకమైన ఇంటెల్‌ (Intel) సంస్థలో ఉద్యోగం  అంటే మాటలు కాదు. అది కూడా సైంటిస్ట్‌గా.. అది కూడా ఏటా రెండు కోట్ల జీతంతో.. యువతకు ఆదర్శంగా నిలుస్తున్న ఈ యూత్‌ ఐకాన్‌ పేరు అభిరాంరెడ్డి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం గౌతమీనగర్‌కు చెందిన వ్యక్తి. కష్టపడి చదువుకుంటే సాధించలేనిది ఏదీ ఉండదు అంటూ నిరూపించాడు.

    దేశంలోనైనా విదేశాల్లోనైనా చదువుకుంటే ఏదైనా సాధించవచ్చు అని ఖండాంతరాలు దాటిన చదువుకు మించిన సంపద లేదని భావి భారత విద్యార్థులకు ఆదర్శంగా నిలిచాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం గౌతమి నగర్ కాలనీకి చెందిన ఏనుగు అభిరామ్ రెడ్డి. అమెరికాలోని ఇంటెల్ రీసెర్చ్ శాస్త్రవేత్తగా ఏడాదికి రెండు కోట్ల వేతనంతో ఉద్యోగం సాధించాడు. అభిరామ్ తండ్రి రామేశ్వర్ రెడ్డి మణుగూరు హెవీ వాటర్ ప్లాంట్ లో సూపర్వైజర్ గా పనిచేస్తుండగా అభిరామ్ స్థానిక ఏ ఈ సి ఎస్ స్కూల్లో పదవ తరగతి 100% మార్కులతో పాస్ అయ్యాడు.


    అదేవిధంగా నెట్లో ర్యాంక్ సాధించి ఎన్ ఐ ఎస్ఇఆర్ లో ప్రవేశం పొందాడు. ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ ఫిజిక్స్ పూర్తి చేశాడు. పాలిమర్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కు ప్రసిద్ధి చెందిన మసాచూసెట్స్ యూనివర్సిటీలో Phd చేశాడు. మెటీరియల్ సైన్స్ ఇంజనీరింగ్ లో డాక్టరేట్ పూర్తి చేసి అనంతరం ఇంటెల్ సంస్థ లో రీసెర్చ్ సైంటిస్ట్ గా చేరాడు. అదేవిధంగా సుదీర్ఘ ప్రచురణల తో గ్రీన్ కార్డ్ సాధించిన అభిరామును ఉపాధ్యాయులు గౌతమ్ నగర్ వాసులు అభినందించారు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: America, Bhadradri kothagudem, JOBS, Private Jobs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు