హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

CIVIL Services Free Coaching: సివిల్స్ అభ్యర్థులకు తెలంగాణ సర్కార్ ఫ్రీ కోచింగ్.. దరఖాస్తుకు మరో 4 రోజులే ఛాన్స్.. ఇలా అప్లై చేయండి

CIVIL Services Free Coaching: సివిల్స్ అభ్యర్థులకు తెలంగాణ సర్కార్ ఫ్రీ కోచింగ్.. దరఖాస్తుకు మరో 4 రోజులే ఛాన్స్.. ఇలా అప్లై చేయండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

యూపీఎస్సీ(UPSC) సివిల్ సర్వీసెస్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్(Telangana BC Study Circle) శుభవార్త చెప్పింది. వారికి ఉచితంగా శిక్షణ అందించనున్నట్లు తెలిపింది. వివరాలు ఇలా ఉన్నాయి.

  ఈ రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగాలకు(Government Jobs) ప్రిపేర్ అవుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఒక్కో పోస్టుకు లక్షలు, వేల సంఖ్యలో అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అయితే పేద వర్గాలకు చెందిన అనేక మంది అభ్యర్థులు సరైన శిక్షణ (Jobs Coaching), గైడెన్స్  లేక ఉద్యోగాల(Jobs) వేటలో వెనుకబడుతున్నారు. ఇలాంటి విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) వివిధ స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేసి ఉచితంగా శిక్షణ(Training) అందిస్తోంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీసీ, ఎస్సీ, ఎస్టీ స్టడీ సర్కిళ్లు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే నోటిఫికేషన్లతో(Job Notifications) పాటు బ్యాంకులు, సివిల్ సర్వీస్(UPSC-Civil Services) ఉద్యోగాలకు ఉచితంగా శిక్షణ అందిస్తోంది. తాజాగా బీసీ స్టడీ సర్కిల్ (BC Study Circle) కీలక ప్రకటన చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఉచిత కోచింగ్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దరఖాస్తుకు ఈ నెల 27 వరకు అవకాశం కల్పించినట్లు వెల్లడించింది.

  ఈ మేరకు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ నామోజు బాలాచారి ప్రకటన విడుదల చేశారు. అభ్యర్థులు స్టడీ సర్కిల్ అధికారిక వెబ్ సైట్ http://tsbcstudycircle.cgg.gov.inలో నమోదు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి శిక్షణకు ఎంపిక చేస్తామన్నారు. ఎంపికైన అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ, స్టడీ మెటీరియల్ అందించనున్నట్లు వెల్లడించారు. అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలకు బీసీ స్టడీ సర్కిల్ ఫోన్ నంబర్ 040-24071178ను సంప్రదించాలని సూచించారు.

  Jobs In Telangana: మ‌హిళా, శిశు సంక్షేమ శాఖ‌లో 275 ఎక్స్‌టెన్ష‌న్ ఆఫీస‌ర్‌ ఉద్యోగాలు.. ద‌ర‌ఖాస్తు వివ‌రాలు

  అర్హతలు: ఈ ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్న అభ్యర్థులు తప్పనిసరిగా గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. ఇప్పటికే వివిధ స్టడీ సర్కిల్స్ నుంచి శిక్షణ పొందిన అభ్యర్థులు దరఖాస్తుకు అనర్హులు. దరఖాస్తు దారుల కుటుంబ ఆదారం రూ. 1.50 లక్షల నుంచి రూ. 2 లక్షలలోపు ఉండాలి. అభ్యర్థులు దరఖాస్తు సమయంలో గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్, కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం, టెన్త్ మెమో, టీసీ తదితర సర్టిఫికేట్లను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.

  Andhra Pradesh Jobs: ఆంధ్రప్రదేశ్‌లో 1,317 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

  ఎలా దరఖాస్తు చేయాలంటే..

  Step 1: అభ్యర్థులు మొదటగా అధికారిక వెబ్ సైట్ https://studycircle.cgg.gov.in/tsbcw/Index.do ను ఓపెన్ చేయాలి.

  Step 2: అనంతరం Apply Online ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

  Step 3: అనంతరం అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అపుతుంది. ఫామ్ లో పేరు, తండ్రి పేరు, తల్లిపేరు తదితర వివరాలను నమోదు చేయాలి.

  Step 4: ఫొటో, సిగ్నేచర్, టెన్త్ మరియు డిగ్రీ మెమో, కుల, ఆదాయ ధ్రువపత్రం, టీసీ తదితర పత్రాల స్కానింగ్ కాపీలను అప్ లోడ్ చేయాలి.

  Step 5: అనంతరం సబ్మిట్ పై క్లిక్ చేయాలి.

  స్క్రీనింగ్ టెన్త్ నిర్వహించే ప్రదేశాలు..

  హైదరాబాద్, మహబూబ్ నగర్, నిజామాబాద్, నల్గొండ, సంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మంలో అభ్యర్థులకు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించనున్నారు.

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Career and Courses, Central Government Jobs, Civil Services, Job notification, UPSC

  ఉత్తమ కథలు