తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్తగా మరో 15 బీసీ గురుకుల డిగ్రీ కాలేజీలను (BC Residential Degree Colleges) ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కాలేజీల్లో చేరేందుకు విద్యార్థులు (Students) దరఖాస్తు చేసుకోవాలని బీసీ గురుకులాల విద్యాసంస్థల కార్యదర్శి మల్లయ్య బట్టు ఓ ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుకు ఈనెల 20 చివరి తేదీ అని మహాత్మా జ్యోతిభాపూలే బీసీ గురుకులాల విద్యాసంస్థల కార్యదర్శి మల్లయ్య బట్టు ఒక ప్రకటనలో వెల్లడించారు. బీసీ విద్యార్థులకు ఉన్నత విద్య అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన అన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు https://mjpabcwreis.cgg.gov.in వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని మల్లయ్య బట్టు సూచించారు.
బిసీ విద్యార్థులకు ఉన్నత విద్య అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని, ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని , https://t.co/IGxPzKLSKL వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని మల్లయ్య బట్టు సూచించారు.
— IPRDepartment (@IPRTelangana) October 19, 2022
ఆయా డిగ్రీ కాలేజీల్లో మొత్తం 4800 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇంటర్ పాసైన అభ్యర్థులు ఈ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. అయితే అభ్యర్థులు ఫస్ట్ అటెంప్ట్ లో పాై ఉండాలి. అభ్యర్థులు 50 శాతం మార్కులతో పాసై ఉండాలి. అభ్యర్థుల తల్లిదండ్రులు / సంరక్షుడి ఆదాయం గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారైతే రూ.1.50 లక్షలలోపు, పట్టణ ప్రాంతాలకు చెందిన వారైతే రూ.2 లక్షలలోపు ఉండాలి.
Freshers Jobs: ఫ్రెషర్స్ కు పండుగ లాంటి వార్త.. భారీగా ఉద్యోగావకాశాలు.. పూర్తి వివరాలివే..
ఎలా అప్లై చేయాలంటే:
- అభ్యర్థులు మొదటగా https://mjpabcwreis.cgg.gov.in/ వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి.
- మొదట Notification - MJPTBCW RDC - 2022 విభాగంలో Online Payment ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- అక్కడ వివరాలను పూర్తి చేసి ఆన్లైన్లో రూ.200 దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
- తర్వాత Online Application ఆప్షన్ పై క్లిక్ చేసి దరఖాస్తును పూర్తి చేయాలి.
- భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్ ఫామ్ ప్రింట్ కాపీని దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థుల ఎంపిక: ఇంటర్ మార్కులు, రిజర్వేషన్ల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Admissions, Career and Courses, Gurukula colleges, JOBS