Home /News /jobs /

TELANGANA APPLICATIONS INVITED FOR ANGANWADI JOBS VACANCIES AT BHADRADRI KOTHAGUDEM DISTRICT HERE FULL DETAILS NS

Telangana Anganwadi Jobs: టెన్త్ పాసైన మహిళలకు గుడ్ న్యూస్.. అంగన్వాడీ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణలో మరో జిల్లాలో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    తెలంగాణలో అంగన్వాడీ ఉద్యోగాల ఖాళీల భర్తీకి ఇటీవల అధికారులు వరుసగా నోటిఫికేషన్లను విడుదల చేస్తున్నారు. తాజాగా భద్రాద్రి కొత్తగుడెం జిల్లాలో ఖాళీల భర్తీకి అధికారులు ప్రకటన విడుదల చేశారు. మొత్తం 24 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అశ్వరాపుపేట, దమ్మపేట మండలాల్లోని అంగన్వాడీ ఖాళీల భర్తీకి ఈ నియమకాలు చేపట్టారు. అంగన్వాడీ టీచర్లు, ఆయాల ఖాళీల భర్తీకి ఈ నియామకాలు చేపట్టారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల ఇప్పటికే ఈ నెల 16 ప్రారంభమైంది. దరఖాస్తుకు ఈ నెల 21ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
    Tutoroot: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్... ఉచితంగా ఆన్‌లైన్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్
    AP Govt Jobs: ఆంధ్రప్రదేశ్ లోని ఆ ప్రభుత్వ విభాగంలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఈరోజే లాస్ట్ డేట్

    ఖాళీల వివరాలు..
    ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 24 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఇందులో అశ్వారావుపేట ప్రాజెక్ట్‌ పరిధిలో అంగన్‌వాడి టీచర్ పోస్టులు 01, ఆయా పోస్టులు 03, మినీ అంగన్‌వాడి టీచర్ పోస్టులు 02, దమ్మపేట ప్రాజెక్ట్‌లో అంగన్‌వాడి టీచర్ పోస్టులు 03, ఆయా పోస్టులు 13, మినీ అంగన్‌వాడి టీచర్ పోస్టులు 02 ఉన్నాయి.

    అర్హతలు, ఇతర వివరాలు..
    టెన్త్ పాసై, వివాహమైన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. స్థానికంగా నివాసం ఉండే వారు మాత్రమే ఈ ఖాళీలకు అప్లై చేసుకోవడానికి అర్హులు. వయస్సు 35 ఏళ్ల లోపు ఉండాలి. షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలను https://mis.tgwdew.in వెబ్ సైట్లో చూడొచ్చు. అభ్యర్థులు https://mis.tgwdcw.in/Recruit.aspx ఈ లింక్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Job notification, JOBS, Telangana, Telangana government jobs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు