తెలంగాణలోని అంగన్వాడీల్లో ఉద్యోగాలు కోరుకునేవారికి అలర్ట్. పలు ఖాళీల భర్తీకి తెలంగాణ మహిళా, శిశు సంక్షేమ శాఖ వేర్వేరు నోటిఫికేషన్లు విడుదల చేసింది. యాదాద్రి-భువనగిరి, సంగారెడ్డి జిల్లాల్లో ఖాళీలను భర్తీ చేస్తోంది. ఈ జిల్లాల్లో ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో అంగన్వాడీ టీచర్లు, అంగన్వాడీ ఆయాలు, మినీ అంగన్వాడీ టీచర్ పోస్టులున్నాయి. యాదాద్రి-భువనగిరి జిల్లాలో 57 ఖాళీలు, సంగారెడ్డి జిల్లాలో 43 పోస్టులున్నాయి. ఈ పోస్టులకు ప్రస్తుతం దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. యాదాద్రి-భువనగిరి జిల్లాలోని పోస్టులకు అప్లై చేయడానికి 2021 ఆగస్ట్ 25 చివరి తేదీ కాగా, సంగారెడ్డి జిల్లాలో పోస్టులకు అప్లై చేయడానికి 2021 ఆగస్ట్ 27 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్లకు సంబంధించిన పూర్తి వివరాలను https://mis.tgwdcw.in/ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. అభ్యర్థులు ఇదే వెబ్సైట్లో దరఖాస్తు చేయాలి.
Telangana Anganwadi Jobs: యాదాద్రి-భువనగిరి జిల్లాలో ఖాళీల వివరాలు ఇవే...
Telangana Anganwadi Jobs: సంగారెడ్డి జిల్లాలో ఖాళీల వివరాలు ఇవే...
మొత్తం ఖాళీలు- 43
అంగన్వాడీ టీచర్- 8
అంగన్వాడీ ఆయా- 45
Telangana Anganwadi Jobs: గుర్తుంచుకోవాల్సిన అంశాలు
విద్యార్హతలు- 10వ తరగతి పాస్ కావాలి.
స్థానికత- స్థానికంగా నివసించేవారు మాత్రమే అప్లై చేయాలి.
ఇతర అర్హతలు- పెళ్లైన మహిళలు మాత్రమే అప్లై చేయాలి. స్థానిక గ్రామపంచాయతీలో నివసించేవారికే అవకాశం.
వయస్సు- 2021 జూలై 1 నాటికి 21 నుంచి 35 ఏళ్లు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కనీస వయస్సు 18 ఏళ్లు.
అభ్యర్థులు ముందుగా https://mis.tgwdcw.in/ వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
ఈ వెబ్సైట్లో వేర్వేరు జిల్లాల్లో అంగన్వాడీ పోస్టులకు వేర్వేరు నోటిఫికేషన్స్ ఉంటాయి.
నోటిఫికేషన్ చదివిన తర్వాత అన్ని అర్హతలు ఉన్న అభ్యర్థులు అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయాలి.
ఆ తర్వాత అప్లై చేసే పోస్ట్ పేరు సెలెక్ట్ చేయాలి.
జిల్లా, ప్రాజెక్ట్, అంగన్వాడీ సెంటర్ సెలెక్ట్ చేయాలి.
అభ్యర్థి పూర్తి వివరాలతో దరఖాస్తు ఫామ్ పూర్తి చేయాలి.
అవసరమైన డాక్యుమెంట్స్ జత చేయాలి.
అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.