ఇంటర్ విద్యార్థులకు శుభవార్త... తగ్గనున్న సిలబస్

Inter Syllabus | కరోనా వైరస్ సంక్షోభం విద్యా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఇప్పటికీ కాలేజీలు తెరుచుకోకపోవడంతో ఇంటర్ సిలబస్ తగ్గించే ఆలోచనలో ఉన్నాయి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డులు.

news18-telugu
Updated: July 10, 2020, 11:18 AM IST
ఇంటర్ విద్యార్థులకు శుభవార్త... తగ్గనున్న సిలబస్
ఇంటర్ విద్యార్థులకు శుభవార్త... తగ్గనున్న సిలబస్ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ఇంటర్మీడియట్ విద్యార్థులకు శుభవార్త. ఇంటర్ సిలబస్ తగ్గిపోనుంది. సిలబస్‌ను కుదించేందుకు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇంటర్ బోర్డులు కసరత్తు చేస్తున్నాయి. ఇప్పటికే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్-CBSE 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు అన్ని సబ్జెక్టుల సిలబస్ 30 శాతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇంటర్ బోర్డులు కూడా అదే బాటలో నడుస్తున్నాయి. ఇంటర్ సిలబస్‌ను కుదించేందుకు కసరత్తు చేస్తున్నాయి. సీబీఎస్ఈ సిలబస్, తెలుగు రాష్ట్రాల ఇంటర్మీడియట్ సిలబస్ దాదాపు ఒకేలా ఉంటుంది. అందుకే సీబీఎస్ఈ ఏఏ టాపిక్స్‌ని సబ్జెక్టుల నుంచి తొలగిస్తుందో ఇక్కడ కూడా ఇంటర్‌లో ఆ టాపిక్స్‌ని తొలగించే అవకాశం ఉంది. మ్యాథ్స్, ఫిజిక్స్, జువాలజీ, కెమిస్ట్రీ, బాటనీ సబ్జెక్ట్స్‌లో సీబీఎస్ఈ తొలగించే టాపిక్స్‌నే ఇక్కడ కూడా ఇంటర్ బోర్డు తొలగిస్తుంది. ఆర్ట్స్, లాంగ్వేజెస్‌లో సీబీఎస్‌ఈతో సంబంధం లేకుండా పాఠ్యాంశాల తొలగింపు ఉంటుంది.

Bank Jobs: బ్యాంక్ జాబ్ మీ కలా? 9640 ఉద్యోగాలను భర్తీ చేస్తున్న ఐబీపీఎస్

Top 10 Jobs: డిమాండ్ ఉన్న టాప్ 10 జాబ్స్ ఇవే... ఈ స్కిల్స్ మీకున్నాయా?

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం ఇంకా ఉంది. దీంతో కాలేజీలు తెరుచుకోలేదు. కరోనా వైరస్ సంక్షోభం లేకపోయుంటే ఈపాటికి ఇంటర్ అడ్మిషన్లు పూర్తై జూనియర్ కాలేజీలు తెరుచుకునేవి. కానీ ఇప్పుడు జూన్ రెండో వారంలో ఉన్నా అడ్మిషన్లు మొదలుకాలేదు. ఈ పరిస్థితి ఇంకా ఎన్నాళ్లు ఉంటుందో తెలియదు. ఒకవేళ ఒకట్రెండు నెలల్లో కాలేజీలు తెరుచుకున్నా ఈ విద్యా సంవత్సరంలో సిలబస్ మొత్తం కవర్ చేయడం సాధ్యం కాదు. అందుకే సిలబస్‌ను కుదించడం తప్ప వేరే మార్గం లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. అయితే సిలబస్ కుదింపు ఈ ఏడాదికి మాత్రమే ఉండొచ్చని, ఆ తర్వాత సంవత్సరం నుంచి మళ్లీ పాత సిలబస్ కొనసాగొచ్చని భావిస్తున్నారు.
Published by: Santhosh Kumar S
First published: July 10, 2020, 11:14 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading