TELANGANA AND ANDHRA PRADESH CIRCLES GRAMIN DAK SEVAK RESULTS UNDER PROCESS SAYS INDIA POST ON TWITTER SS
India Post GDS Results 2021: పోస్ట్ ఆఫీస్ రిక్రూట్మెంట్ ఫలితాలు ఎప్పుడు? రిజల్ట్స్‌పై ట్విట్టర్లో క్లారిటీ
India Post GDS Results 2021: పోస్ట్ ఆఫీస్ రిక్రూట్మెంట్ ఫలితాలు ఎప్పుడు? రిజల్ట్స్‌పై ట్విట్టర్లో క్లారిటీ
(ప్రతీకాత్మక చిత్రం)
India Post GDS Results 2021 | తెలంగాణ (Telangana), ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రాల్లోని పోస్ట్ ఆఫీసుల్లో గ్రామీణ డాక్ సేవక్ (Gramin Dak Sevak) పోస్టులకు దరఖాస్తు చేసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇండియా పోస్ట్ ట్విట్టర్లో క్లారిటీ ఇచ్చింది.
ఇండియా పోస్ట్ దేశవ్యాప్తంగా గ్రామీణ డాక్ సేవక్ (Gramin Dak Sevak) పోస్టుల్ని భర్తీ చేసేందుకు రాష్ట్రాల వారీగా ప్రతీ ఏటా రెండుసార్లు జాబ్ నోటిఫికేషన్లు (Job Notification) విడుదల చేస్తూ ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ముగిసిన రెండు నెలల్లో ఫలితాలు విడుదల చేస్తూ ఉంటుంది. టెన్త్ అర్హతతో భర్తీ చేసే పోస్టులు కాబట్టి లక్షల్లో అభ్యర్థులు దరఖాస్తు చేస్తుంటారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా గ్రామీణ డాక్ సేవక్ (Gramin Dak Sevak) పోస్టుల్ని భర్తీ చేసేందుకు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇండియా పోస్ట్ వేర్వేరుగా నోటిఫికేషన్స్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో 2296, తెలంగాణ సర్కిల్లో 1150 పోస్టులు భర్తీ చేసేందుకు దరఖాస్తుల్ని స్వీకరించింది. దరఖాస్తు ప్రక్రియ ముగిసి ఆరు నెలలు గడిచినా ఫలితాలు విడుదల కాకపోవడంపై అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల కోసం లక్షలాది మంది దరఖాస్తు చేశారు. వారంతా ఆరు నెలలుగా ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. సాధారణంగా రెండు నెలల్లో వచ్చే ఫలితాలు ఇంకా రాకపోవడంపై అభ్యర్థుల్లో కలవరం మొదలైంది.
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఫలితాల విడుదల ఆలస్యం అవుతుందని మొదట భావించినా, కోవిడ్ 19 ప్రభావం తగ్గిన తర్వాత కూడా ఫలితాలు విడుదల కాలేదు. దీంతో అభ్యర్థులు ట్విట్టర్లో ఇండియా పోస్ట్‌ను సంప్రదిస్తున్నారు. తెలంగాణ సర్కిల్లో గ్రామీణ డాక్ సేవక్ ఫలితాల విడుదల ప్రక్రియ తుది దశకు వచ్చినట్టు ఇండియా పోస్ట్ ట్విట్టర్లో వివరించింది.
ఇక ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో గ్రామీణ డాక్ సేవక్ ఫలితాలపై ఏవైనా సందేహాలు ఉంటే ఆంధ్రప్రదేశ్ సర్కిల్ ఆఫీస్ రిక్రూట్మెంట్ సెక్షన్ ఇమెయిల్ ఐడీ rectt.ap@indiapost.gov.in లో సంప్రదించాలని ఇండియా పోస్ట్ సూచించింది.
For any queries regarding the Andhra Pradesh Postal Circle GDS recruitment, it is requested to contact Recruitment section of APCO on email ID: rectt.ap@indiapost.gov.in
ఇటీవల కేరళ సర్కిల్ ఫలితాలు విడుదలయ్యాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు పశ్చిమ బెంగాల్లో 2357 పోస్టులు, బీహార్‌లో 1940 పోస్టులు, మహారాష్ట్రలో 2428 పోస్టులు, చత్తీస్‌గఢ్‌లో 1137 పోస్టులు, ఢిల్లీలో 233 పోస్టులకు సంబంధించిన ఫలితాలు కూడా పెండింగ్‌లో ఉన్నాయి.
ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్‌లో 4264 పోస్టులు, ఉత్తరాఖండ్‌లో 581 పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. గ్రామీణ డాక్ సేవక్ పోస్టులకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు ఫలితాల కోసం ఇండియా పోస్ట్ రిక్రూట్మెంట్ అధికారిక వెబ్సైట్ https://appost.in/ ఫాలో కావాలి.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.