మహాత్మా జ్యోతిభా పూలే బీసీ సంక్షేమ వ్యవసాయ మహిళా గురుకుల డిగ్రీ కాలేజీలో మొదటి సంవత్సరంలో ప్రవేశం కోసం (Gurukul College Admissions) దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని మహాత్మా జ్యోతిభాపూలే బీసీ సంక్షేమ గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి డాక్టర్ మల్లయ్య బట్టు ఒక ప్రకటనలో తెలిపారు. వ్యవసాయ డిగ్రీ కాలేజీలో మొదటి సంవత్సరంలో ప్రవేశం కోసం ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ఎంసెట్ (EAMCET), అగ్రిసెట్ లో వచ్చిన ర్యాంకు ఆధారంగా సీట్ల కేటాయింపు జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ విద్యా సంవత్సరం మహిళా వ్యవసాయ డిగ్రీ కాలేజీలు వనపర్తి, కరీంనగర్ లో ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు మహాత్మా జ్యోతిభాపూలే బీసీ సంక్షేమ గురుకుల విద్యాసంస్థల వెబ్ సైట్ http://mjptbcwreis.telangana.gov.in/ను సందర్శించాలని మల్లయ్య బట్టు సూచించారు.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తుల ప్రక్రియ: నవంబర్ 11
దరఖాస్తులకు ఆఖరి తేదీ: డిసెంబర్ 4
దరఖాస్తుల ఎడిట్ ఛాన్స్: డిసెంబర్ 6, 7
మెరిట్ లిస్ట్: డిసెంబర్ 10
Affordable Education: అత్యంత చౌకగా విద్యను అందిస్తున్న దేశాలివే..
ఇదిలా ఉంటే.. ఉస్మానియా యూనివర్సిటీ తాజాగా కీలక ప్రకటన చేసింది. గతంలో యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ, పీజీ చదివి ఫెయిల్ అయిన విద్యార్థులకు శుభవార్త చెప్పింది. అలాంటి విద్యార్థులకు మళ్లీ పరీక్షలు రాసి డిగ్రీ పట్టా పొందే అవకాశాన్ని కల్పించింది యూనివర్సిటీ. దీంతో వారు మళ్లీ డిగ్రీ పట్టా పొందొచ్చు. ఈ మేరకు వన్ టైం ఛాన్స్ ను కల్పిస్తున్నట్లు ఉస్మానియా యూనివర్సిటీ వెల్లడించింది. స్టూడెంట్స్, పేరెంట్స్, కాలేజీల నిర్వాహకుల వినతి మేరకు అకడమిక్ స్టాండింగ్ కమిటీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది.
ఈ మేరకు విద్యార్థులకు వన్ టైం చాన్స్ ఇవ్వాలని నిర్ణయించినట్లు ఉస్మానియా యూనివర్సిటీ పరీక్షల విభాగం ప్రకటన విడుదల చేసింది. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో 2010 నుంచి 2017 విద్యా సంవత్సరం వరకు వివిధ కోర్సులు చదివి ఫెయిల్ అయిన వారికి ఈ అవకాశం ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నారు.
ఆయా విద్యార్థులు పేపర్ కు రూ.10 వేల చొప్పున అపరాధ రుసుము చెల్లించాల్సి ఉంటుందని ప్రకటనలో వెల్లడించారు. ఎంఈ, ఎంటెక్, ప్రాజెక్టు, వైవాకు రూ.20 వేలను చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. విద్యార్థులు ఇతర పూర్తి వివరాలకు ఉస్మానియా యూనివర్సిటీ అధికారిక వెబ్ సైట్ https://www.osmania.ac.in/ ను సందర్శించాలని యూనివర్సిటీ అధికారులు సూచించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Admissions, Colleges, Telangana