తెలంగాణలోని విద్యార్థులకు గుడ్ న్యూస్. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్-TASK రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైంది. తెలంగాణలోని యువతీయువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచేందుకు టాస్క్ ద్వారా శిక్షణ ఇస్తోంది తెలంగాణ ప్రభుత్వం. 2020-21 విద్యా సంవత్సరానికి స్టూడెంట్ రిజిస్ట్రేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. బీఈ, బీటెక్, బీఫార్మసీ, ఎంసీఏ, ఎంబీఏ, పీజీడీఎం, బీఏ, బీఎస్సీ, బీకాం, బీసీఏ, బీబీఎం, బీబీఏ, ఎంఏ, ఎంఎస్సీ, ఎంకామ్, పాలిటెక్నిక్ విద్యార్థుల నుంచి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది టాస్క్. 2020-21 విద్యా సంవత్సరంలో టాస్క్‌తో రిజిస్టర్ అయిన విద్యార్థులు దరఖాస్తు చేయొచ్చు. పైన వెల్లడించిన కోర్సుల్లో మొదటి, రెండో, మూడో, నాలుగో సంవత్సరాల్లో చదువుతున్న విద్యార్థులు రిజిస్టర్ చేసుకోవచ్చు.
ONGC Recruitment 2020: ఆంధ్రప్రదేశ్‌లోని ఓఎన్జీసీలో జాబ్స్... దరఖాస్తుకు 3 రోజులే ఛాన్స్DRDO Recruitment 2020: హైదరాబాద్‌లోని డీఆర్డీఓలో ఉద్యోగాలు... వేతనం రూ.54,000
రిజిస్ట్రేషన్ కోసం బీఈ, బీటెక్ చదువుతున్న జనరల్, ఓబీసీ విద్యార్థులు రూ.1416, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.708, డిగ్రీ, ఎంసీఏ, ఎంబీఏ, పీజీడీఎం, పీజీ, ఫార్మసీ చదువుతున్న జనరల్, ఓబీసీ విద్యార్థులు రూ.590, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.295, పాలిటెక్నిక్ విద్యార్థులు రూ.295 ఫీజు చెల్లించాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2020 డిసెంబర్ 27 చివరి తేదీ. ఇందులో రిజిస్టర్ చేసుకోవడానికి, పరీక్షల్లో వచ్చిన మార్కుల శాతానికి సంబంధం లేదు. విద్యార్థులు ఎవరైనా రిజిస్టర్ చేసుకోవచ్చు. అయితే ఉద్యోగాలకు నియమించే కంపెనీలు కోరుకున్న విద్యార్హతలు ఉన్న వారికి మాత్రమే ప్లేస్మెంట్ ప్రక్రియలో పాల్గొనే అవకాశం లభిస్తుంది.
SBI PO Recruitment 2020: డిగ్రీ పాసైనవారికి ఎస్బీఐలో 2000 ఉద్యోగాలు... ఎగ్జామ్ ప్యాటర్న్ ఇదే
Private Jobs: ఓ ప్రైవేట్ సంస్థలో 150 ఖాళీలు... APSSDC జాబ్ నోటీస్
ఇప్పటికే టాస్క్‌లో రిజిస్టర్ చేసుకున్న విద్యార్థులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి టాస్క్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే జీవితాంతం వేలిడిటీ ఉంటుంది. విద్యార్థులు టాస్క్‌లో రిజిస్టర్ చేసుకుంటే వారికి పరిశ్రమ సంబంధిత కోర్సులు అందుబాటులో ఉంటాయి. విద్యార్థులు సాఫ్ట్ స్కిల్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ నేర్చుకోవచ్చు. సంబంధిత పరిశ్రమల్ని సందర్శించే అవకాశం లభిస్తుంది. ఇంటర్న్‌షిప్ అవకాశాలు లభిస్తాయి. నిపుణులతో మాట్లాడొచ్చు. పలు సంస్థలు నిర్వహించే ప్లేస్మెంట్ డ్రైవ్స్‌లో పాల్గొనొచ్చు. ఇ-లెర్నింగ్ కంటెంట్‌ని ఆన్లైన్, మ్యాసీవ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సులు-MOOCs యాక్సెస్ చేయొచ్చు. కెరీర్ డెవలప్మెంట్ వర్క్‌షాప్స్‌లో పాల్గొనొచ్చు. మరిన్ని వివరాలకు తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ https://www.task.telangana.gov.in/ వెబ్సైట్లో Skill Offerings పేజీలో మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. విద్యార్థులు ఇదే వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాలి.