గుడ్ న్యూస్... 50,000 మంది నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గొప్ప అవకాశం

నిరుద్యోగులకు, యువతీయువకులకు, విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నైపుణ్యాలు పెంచుకునే అవకాశం కల్పిస్తోంది.

news18-telugu
Updated: July 14, 2020, 6:31 PM IST
గుడ్ న్యూస్... 50,000 మంది నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గొప్ప అవకాశం
గుడ్ న్యూస్... 50,000 మంది నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గొప్ప అవకాశం (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
తెలంగాణలోని నిరుద్యోగ యువతకు శుభవార్త. 50,000 మంది నిరుద్యోగులకు పలు అంశాల్లో నైపుణ్యాలు పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆన్‌లైన్ ఎడ్ టెక్ సంస్థ కోర్స్ ఎరాతో ఒప్పందం కుదుర్చుకుంది. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్-TASK, కోర్స్ ఎరా సంయుక్తంగా క్లౌడ్ కంప్యూటింగ్, డేటా సైన్స్, బ్లాక్ చెయిన్, కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ లాంటి డిమాండ్ ఉన్న 3,800 కోర్సుల్ని ఉచితంగా నిరుద్యోగ యువతకు అందించనుంది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా జాబ్ మార్కెట్‌లో సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే. దీంతో కోర్స్ ఎరా ప్రపంచవ్యాప్తంగా వర్క్‌ఫోర్స్ రికవరీ ఇనీషియేటీవ్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రభుత్వాలు, సంస్థలతో కలిసి 3800 కోర్సుల్ని ఉచితంగా అందిస్తోంది. అందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం కోర్స్ ఎరాతో ఒప్పందం చేసుకుంది.

Top 10 Jobs: ఈ టాప్ 10 జాబ్స్‌కి ఫుల్ డిమాండ్... నేర్చుకోవాల్సిన స్కిల్స్ ఇవే

Railway Course: రైల్వే ఉద్యోగం మీ కలా? ఈ కోర్సులు చేయండి

తెలంగాణలోని 50,000 మంది నిరుద్యోగులు కోర్స్ ఎరా అందించే 3,800 కోర్సుల్ని నేర్చుకోవచ్చు. కోర్సులు నేర్చుకోవడం మాత్రమే కాదు గూగుల్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థల నుంచి సర్టిఫికెట్లు పొందొచ్చు. నైపుణ్యాలు సాధించిన వారికి ఉద్యోగావకాశాలు కూడా మెరుగవుతాయి. ఆసక్తిగల యువతీయువకులు, నిరుద్యోగులు 2020 సెప్టెంబర్ 30 లోగా ఎన్‌రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఏడాది చివరిలోగా కోర్సులు పూర్తి చేయాలి. మరిన్ని వివరాలకు https://www.task.telangana.gov.in/ వెబ్‌సైట్ ఫాలో కావాలి.
Published by: Santhosh Kumar S
First published: July 14, 2020, 6:31 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading