హైదరాబాద్ (Hyderabad) లోని జీనోమ్ వ్యాలీలో బి-హబ్ తో సహా ఐదు కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల్లో తెలంగాణ ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ (Minister KTR) పాల్గొన్నారు. తెలంగాణ లైఫ్ సైన్సెస్ ఎకోసిస్టమ్‌లో భాగం కాబోతున్న ఈ కొత్త ప్రాజెక్టులు రాష్ట్రానికి రూ. 1,100 కోట్ల పెట్టుబడులను తెస్తాయని మంత్రి అన్నారు. తద్వారా రాష్ట్రంలోని దాదాపు 3,000 ఉద్యోగావకాశాలు (Jobs) ఏర్పడుతాయన్నారు.
మంత్రి కేటీఆర్ ప్రారంభించిన కంపెనీల వివరాలు:
1. జీనోమ్ వ్యాలీలో Rx Propellant ద్వారా 9 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అభివృద్ది చేసే క్యూరేటెడ్ లైఫ్ సైన్సెస్ మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టును మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. జీనోమ్ వ్యాలీలో అత్యాధునిక సౌకర్యాలను అందించడానికి Rx Propellant మరియు దాని అనుబంధ సంస్థలు రూ.900 కోట్లు పెట్టుబడి పెట్టనున్నాయి.
Central Govt Jobs 2022: నిరుద్యోగులకు అలర్ట్.. ఆ ప్రముఖ సంస్థలో ఉద్యోగాలు .. దరఖాస్తుకు మరో 3 రోజులే ఛాన్స్
Minister @KTRTRS today participated in the inauguration and foundations stone events of five new projects, including B-Hub, in Genome Valley. The new additions to Telangana’s life sciences ecosystem will bring an investment of ₹1,100 Cr and about 3,000 jobs. #InvestTelangana pic.twitter.com/jehfxyfHCQ
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) October 18, 2022
2. Yapan Bio's ప్రాసెస్ డెవలప్‌మెంట్ ఫెసిలిటీని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
3. పలురకాల ప్రీక్లినికల్ రీసెర్చ్ సేవలను అందించే GV రీసెర్చ్ ప్లాట్‌ఫారమ్ (GVRP) అత్యాధునిక సౌకర్యాన్ని మంత్రి ప్రారంభించారు. 28,000 చ.అ.విస్తీర్ణంలో నిర్మించిన ఈ ఫెసిలిటీ లో వెటర్నరీ సైన్స్, టాక్సికాలజీ, ఫార్మకాలజీ మరియు ఎనలిటికల్ రీసెర్చ్ డొమైన్‌లలో పనిచేసే నిపుణులు తమ పరిశోధన కార్యకలాపాలు నిర్వహిస్తారు.
4. Neovantage Park (MN పార్క్)లో VIMTA ల్యాబ్స్ యొక్క అత్యాధునిక EMI/EMC ల్యాబ్‌ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఇది యాక్టివ్ మెడికల్ డివైసెస్, వైర్‌లెస్, డిఫెన్స్, ఇతర ఎలక్ట్రానిక్ ఇండస్ట్రియల్ సెక్టార్‌ల ESDM అవసరాలకు ఉపయోగపడేలా అధునాతన మరియు సంక్లిష్టమైన పరీక్షలను నిర్వహిస్తుంది.
ఈ కార్యక్రమాల్లో పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, లైఫ్ సైన్సెస్ & ఫార్మా డైరెక్టర్ శక్తి నాగప్పన్, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, అయా కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Investments, IT jobs, JOBS, Minister ktr, Private Jobs