Telugu must as a language in 10th Class | తెలంగాణ ప్రభుత్వం పదోతరగతి తెలుగు పేపర్‌పై కీలక నిర్ణయం తీసుకొంది. సీబీఎస్ఈ, ఐసీఈఎస్ఈ, ఐబీ సహా ఇతర బోర్డుల గుర్తింపు పొందిన స్కూళ్లల్లో పదో తరగతి చదివే విద్యార్థులు ఈ ఏడాది వార్షిక పరీక్షల్లో తెలుగు పేపర్ రాసి తప్పనిసరిగా విద్యార్థులు పాస్ కావాల్సి ఉంటుంది.
తెలంగాణ (Telangana) ప్రభుత్వం పదోతరగతి తెలుగు పేపర్‌పై కీలక నిర్ణయం తీసుకొంది. సీబీఎస్ఈ, ఐసీఈఎస్ఈ, ఐబీ సహా ఇతర బోర్డుల గుర్తింపు పొందిన స్కూళ్లల్లో పదో తరగతి చదివే విద్యార్థులు ఈ ఏడాది వార్షిక పరీక్షల్లో తెలుగు పేపర్ రాసి తప్పనిసరిగా విద్యార్థులు పాస్ కావాల్సి ఉంటుంది. తెలంగాణలో తొలిసారిగా పదో తరగతి వార్షిక పరీక్షల్లో తెలుగు పేపర్‌ను తప్పనిసరిగా ప్రవేశపెడుతున్నారు. ప్రస్తుతం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE), ఇంటర్నేషనల్ బోర్డు (IB), ఇండియన్ సర్టిఫికెట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (ICSE) బోర్డుల ద్వారా గుర్తింపు పొందిన స్కూళ్లల్లో బహుళభాషా విధానం అమల్లో ఉంది.
ఈ విధానం ప్రకారం 1 నుంచి 4 తరగతుల్లో ఏదైనా రెండుభాషలు, 5 నుంచి 8 వరకు మూడులు నేర్చుకోవాలి. 9, 10 తరగతుల్లో ఇంగ్లిష్ తప్పనిసరి ఉంది. ఇంగ్లీష్‌తోపాటు మరో ప్రాంతీయ భాషను విద్యార్థులు ఎంచుకొనే అవకాశం ఉంది. అయితే తాజాగా తెలంగాణలో తెలుగు తప్పనిసరి కావడంతో పదో తరగతిలోకి ప్రవేశించే విద్యార్థులు తప్పనిసరిగా ఇంగ్లిష్, తెలుగులను మాత్రమే ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.
ప్రభుత్వం విడుదల చేసిన తాజా గైడ్‌లైన్స్..
- తెలంగాణ రాష్ట్రంలో అన్ని సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ బోర్డుల స్కూళ్లు తెలుగు టీచర్లను తప్పనిసరిగా నియమించుకోవాలి.
- పాఠశాలల్లో తెలుగు పాఠ్యపుస్తకాలను వినియోగించాలి.
- ఏ స్కూల్ అయినా తెలుగును తప్పనిసరిగా అమలు చేయకుంటే తొలుత నోటీసులు జారీచేస్తారు.
RBI Grade B: ఆర్బీఐ గ్రేడ్- B ఫేజ్ 2 అడ్మిట్ కార్డ్స్ విడుదల.. ఇలా డౌన్లోడ్ చేసుకోండి..
- 15 రోజుల్లో వివరణ ఇవ్వాలి. అనంతరం పరిశీలంచి అనుమతులు ఇస్తారు.
- ఏ స్కూల్ అయినా తెలుగును బోధించని పక్షంలో సబ్‌రూల్ 7 (సీ) రూల్ -2 ప్రకారం రూ.50 వేలు జరిమానా విధిస్తారు.
- రెండోసారి ఉల్లంఘిస్తే అదనంగా రూ.1 లక్ష వరకు జరిమానా విధిస్తారు.
చట్టం ఏర్పాటు అమలు వివరాలు..
తెలుగుభాష పరిరక్షణ కోసం పాఠశాలల్లో తెలుగును ఓ సబ్జెక్టుగా బోధించేలా 2018 మార్చి 30న యాక్ట్-10 పేరుతో కేసీఆర్ ప్రభుత్వం చట్టాన్ని రూపొందించింది.
దీనిని అమలుచేయాలని సూచిస్తూ 2018 ఏప్రిల్ 2న జీవో-15ను జారీచేసింది. 2018-19 విద్యా సంవత్సరం నుంచి దశలవారీగా తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా అమలుచేస్తున్నారు. ఇప్పటివరకు 1,2,3,4,6,7,8,9 తరగతుల్లో తెలుగును బోధనాంశంగా అమలుచేస్తున్నారు. ఈ ప్రణాళిక ప్రకారం ఈ ఏడాది నుంచి 5, 10 తరగతుల్లో తెలుగును తప్పనిసరి చేసింది. ఈ నేపథ్యంలో 2022 -23 విద్యాసంవత్సరానికి రాష్ట్రంలోని అన్ని తరగతుల్లో తెలుగు అమల్లోకి వచ్చింది.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.