Home /News /jobs /

TELANGANA 10TH CLASS PREPARATION GET A GOOD SCORE IN TELUGU FOLLOW THESE TIPS MDK EVK

TS 10th Class Preparation: తెలుగులో మంచి స్కోర్ సాధించాలా.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

TS 10th Class Telugu | పదో తరగతి పరీక్షలు ఈ సంవత్సరం ఎగ్జామ్ పేపర్ ఒకటే పేపర్ ఉండడంతో 60 నుంచి 70 మార్కులు సంపాదించి విధంగా ఈజీ మెథడ్ అని తెలుగు భాష పండితులు చెబుతున్నారు.

    సేక‌ర‌ణ - కె. వీరన్న‌, న్యూస్‌18 తెలుగు, మెదక్
    ర‌చ‌యిత - మదునూరి సూర్యనారాయణ, ఎస్ఏ తెలుగు, జీహెచ్ఎస్‌ సంగారెడ్డి

    పదో తరగతి (Tenth Class) పరీక్షలు ఈ సంవత్సరం ఎగ్జామ్ పేపర్ ఒకటే పేపర్ ఉండడంతో 60 నుంచి 70 మార్కులు సంపాదించి విధంగా ఈజీ మెథడ్ అని తెలుగు భాష పండితులు చెబుతున్నారు. పదో తరగతి ప్రథమ భాషతెలుగులో ఎక్కువ 60-80 మార్కులు రావాలంటే తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు సంపాదించేందుకు ఈజీ మెథ‌డ్‌గా మితడుగా సంపాదించొచ్చు. మన తెలుగు భాష సంస్కృతాన్ని పద్ధతి తెలుసుకోవాలి. వ్యాకరణాలను ఈ సంవత్సరం ఎక్కువగా వ్యాకరణాల ను ఇస్తాడు కాబట్టి వాటిని సరిగ్గా చూసి రాస్తే పదో తరగతి విద్యార్థులకు 60 నుంచి 70 మార్కుల వరకు ఈజీగా సంపాదించుకోవచ్చు.

    TS TET 2022: అంచ‌నాకు మించి టెట్ ద‌ర‌ఖాస్తులు.. 1600 ప‌రీక్ష కేంద్రాల ఏర్పాటు!

    మంచి స్కోర్ రావాలంటే పాటించాల్సిన‌వి..

    1) పాఠంపై అవగాహన పెంచుకోవాలి. 2,3 సార్లు చదవాలి.

    2)సమకాలీన అంశాలను పాఠంలోని అంశాల తో సమన్వయం చేసుకోవాలి.
    ఉదా. దానశీలం..
    సమాజంలో దానగుణం గల వారిని పరిశీలించి వారి గురించి తెలుసుకోవాలి.

    3)భాషా పరిణామాలు తెలుసుకోవాలి. విద్యార్థి తన పలుకుబడిభాషను, బడి పలుకులభాష తేడాలను గమనించి తన యాసను ఉప‌యోగించాలి.

    4)తెలంగాణ సాయుధ పోరాటం గూర్చి తెలుసుకోవాలి.

    5)దళిత ఉద్యమం భాగ్యరెడ్డి వర్మ చేసిన పోరాటం

    7)తెలంగాణ లోని ప్రసిద్ధి చెందిన శతక కవుల గూర్చి, పద్య రచన అందులోని నీతిని తెలుసుకోవాలి.

    6)సంపాదకీయాలు, పత్రిక లు వాటి పాత్ర.

    7) సమాజంలో మనిషి ధైర్యంగా ముందుకు అడుగు వేయాలి.

    TS Gurukula Admission: బీసీ గురుకులాల్లో ఖాళీలు.. భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం.. వివ‌రాలు

    8) చారిత్రక పట్టణం ,దాని ప్రాభవం,ప్రాశస్త్యం

    9) తెలంగాణ కథ ,హైదరాబాదు కేంద్రం గా కథా సాహిత్యం.

    ఈ విషయాలు తెలుసుకోండి

    1) ప్రతి పాఠం మీద అవగాహన పెంచుకుని ప్రశ్న ఏ విధంగా ఇచ్చినా రాయగలగాలి.

    2) అవగాహన- ప్రతిస్పందన ఇందులో ఉపవాచకం పేరా మరియు అపరిచిత గద్యం శ్రద్ధ‌గా చదవాలి.

    జవాబులు సూటిగా ,వీలైనన్ని తక్కువ పదాలలో రాయాలి. ప్రతిపదార్థం, తాత్పర్యం రాయడం చాలా సులువు.

    స్వీయ రచన

    మీరు చదివినవి,తెలుసుకున్నవి వీటి పైననే ఆధారపడి ఉంటుంది. రెండింటినీ కలిపి సూటిగా, స్పష్టంగా, ఉదాహరణలతో కలిపి రాయండి. తప్పకుండా ఎక్కువ మార్కులు వస్తాయి.

    సృజనాత్మక తకు మీరు కొత్త దనం జోడించండి. ఒకేపేజీలో లేఖ,గానీ,ఆహ్వానపత్రం గానీకరపత్రం గానీ వచ్చేటట్లు చూడండి. రామాయణం రెండు మూడు సార్లు చదవండి. నేటి సమాజానికి ఎందుకు అవసరమో ఆలోచించండి.దానికి తగినట్లుగా రాయండి. విజయం మీ సొంత మవుతుంది.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: 10th Class Exams, Career and Courses, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు