Home /News /jobs /

TELANGAN TRS LEADER PALLA RAJESWAR REDDY ANNOUNCED NEW SCHEMES FOR UNEMPLOYEES HERE ARE FULL DETAILS BA

తెలంగాణలో నిరుద్యోగుల కోసం కొత్త పథకం.. తేదీ కూడా ప్రకటన

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణలో నిరుద్యోగుల కోసం కొత్త పథకాన్ని తీసుకొస్తున్నట్టు వరంగల్ - నల్లగొండ - ఖమ్మం జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి చెప్పారు. నల్లగొండలో ఆయన పట్టభద్రుల ఎమ్మెల్సీ సన్నాహక సమావేశంలో మాట్లాడారు.

ఇంకా చదవండి ...
    తెలంగాణలో నిరుద్యోగుల కోసం కొత్త పథకాన్ని తీసుకొస్తున్నట్టు వరంగల్ - నల్లగొండ - ఖమ్మం జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి చెప్పారు. నల్లగొండలో ఆయన పట్టభద్రుల ఎమ్మెల్సీ సన్నాహక సమావేశంలో మాట్లాడారు. ఏప్రిల్ 1 నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ నిరుద్యోగుల కోసం కొత్త పథకం తీసుకొస్తున్నట్టు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగులతో చర్చించిన అంశాలను వెల్లడించారు. టీఎన్ జీవో, ఎన్జీవో, సెక్రటేరియట్, ఉపాధ్యాయ సంఘాల నేతలతో మాట్లాడారని.. వారికి సంబంధించి పీఆర్సీ, ఇతర అంశాలతో మాట్లాడారని చెప్పారు. అలాగే, తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థల్లో లక్షా 30వేల ఉద్యోగాలు భర్తీ చేసినట్టు చెప్పారు. రాష్ట్రానికి ఐటీఐఆర్ వచ్చి ఉంటే లక్ష ఉద్యోగాలు వచ్చేవని అన్నారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: CM KCR, JOBS, Palla rajeshwar reddy, Telangana, Trs, Unemployment

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు