Home /News /jobs /

TELANGAN TET 32 68 PER CENT QUALIFIED IN TET PAPER 1 AND 49 64 PER CENT IN PAPER 2 CANDIDATES WANT ANOTHER TET NOTIFICATION VB

TS TET Qualified Candidates: టెట్ లో ఎంత మంది క్వాలిఫై అయ్యారో తెలుసా.. మరో టెట్ ఉంటుందా..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణ పాఠశాల విద్యా శాఖ టెట్ 2022 ఫలితాలను విడుదల చేశారు. పరీక్షలో హాజరైన అభ్యర్థులు tstet.cgg.gov.inలో తెలంగాణ TET ఫలితాలను చూసుకోవచ్చు. అభ్యర్థులు తమ హాల్ టికెట్ నంబర్ మరియు పుట్టిన తేదీని ఉపయోగించి లాగిన్ అవ్వడంతో టెట్ ఫలితాలను సరి చూసుకోవచ్చు.

ఇంకా చదవండి ...
తెలంగాణ(Telangana) పాఠశాల విద్యా శాఖ టెట్ 2022 ఫలితాలను విడుదల చేశారు. పరీక్షలో హాజరైన అభ్యర్థులు tstet.cgg.gov.inలో తెలంగాణ TET ఫలితాలను చూసుకోవచ్చు. అభ్యర్థులు తమ హాల్ టికెట్ నంబర్ మరియు పుట్టిన తేదీని ఉపయోగించి లాగిన్ అవ్వడంతో టెట్ ఫలితాలను సరిచూసుకోవచ్చు. TS TET 2022 పరీక్ష జూన్ 12న రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు మరియు మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 5:00 గంటల వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సారి టెట్ పేపర్ 1కు బీఈడీ చేసిన వారు కూడా అర్హులుగా పేర్కొనడంతో భారీగా దరఖాస్తులు వచ్చాయి. టెట్ వ్యాలిడిటీ ఈ సారి లైఫ్ లాంగ్ ఉండేలా నోటిఫికేషన్లో పేర్కొన్నారు.

ఇక టెట్ ఫలితాల విషయానికి వస్తే.. తెలంగాణలోని 33 జిల్లాల నుంచి టెట్ పేపర్ 1 కు 3,18,444 మంది దరఖాస్తు చేసుకోగా.. అందులో 1,04,078 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. అంటే 32.68 శాతం మంది టెట్ పేపర్ 1లో క్వాలిఫై అయ్యారు. టెట్ పేపర్ 2 విషయానికి వస్తే.. మొత్తం 2,50,897 మంది దరఖాస్తు చేసుకోగా అందులో 1,24,535 మంది అర్హత సాధించారు. అంటే 49.64 శాతం మంది ఉపాధ్యాయ పోస్టులకు అర్హత పొందారు. పేపర్ 1 క్వాలిఫై అయిన వారికి ఎస్జీటీ పోస్టులు, పేపర్ 2 క్వాలిఫై అయిన అభ్యర్థులు స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.



ఇదిలా ఉండగా టెట్ లో అర్హత సాధించని వారికి మరో అవకాశం కల్పించాలంటూ కోరుతున్నారు. పేపర్ 1కు చాలా తక్కువ మంది క్వాలిఫై కావడం, అంతే కాకుండా ఆరునెలలకు ఒకసారి వెలువడాల్సిన టెట్ నోటిఫికేషన్ ఐదేళ్లకు వెలువడటంతో తాము ఎంతో నష్టపోయామని వాపోతున్నారు. దీంతో మరోసారి టెట్ నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ అభ్యర్థులు కోరుతున్నారు.
Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, Ctet, JOBS, TS TET 2022

తదుపరి వార్తలు