TELANAGNA GOVT TO RECRUIT 447 EMPLOYEES IN HEALTH DEPARTMENT AS COVID CASES RISE IN STATE SK
Telangana Jobs: తెలంగాణలో 449 ఉద్యోగాల భర్తీకి ఉత్తర్వులు.. పూర్తి వివరాలు ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)
Telangana: జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో జిల్లా సెలక్షన్ కమిటీ ద్వారా ఇంటర్వ్యూలు నిర్వహించి భర్తీ చేస్తారని తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వుల్లో వెల్లడించింది. ఇందుకు సంబంధించి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖను ఆదేశించింది.
తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృభిస్తోంది. కొత్త కేసులు భారీగా పెరిగాయి. ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యే రోగుల సంఖ్య పెరిగింది. ఐతే చాలా ఆస్పత్రుల్లో సిబ్బంది కొరత ఉన్న నేపథ్యంలో వైద్య సేవలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కోవిడ్ రోగులకు చికిత్స అందించేందుకు అవసరమైన సిబ్బంది నియామకంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖలోని పలు విభాగాల్లో 448 ఉద్యోగాల భర్తీకి ఉత్తర్వులు జారీచేసింది. రాబోయే మూడు నెలల పాటు ఒప్పంద ప్రాతిపదికన 78 మంది, ఔట్ సోర్సింగ్ పద్దతిలో 371 మంది నియమించుకునేందు తెలంగాణ ఆర్థికశాఖ ఆమోద ముద్రవేసింది. ఈ మేరకు ఆదివారం తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి ఉత్తర్వులు జారీచేశారు.
ఉద్యోగాల వివరాలు:
అనస్థీషియా విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు- 32 మంది
జనరల్ మెడిసిన్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు- 25 మంది
పల్మనరీ మెడిసిన్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు -21 మంది
ఈ పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు.
స్టాఫ్ నర్సులు- 315 మంది
ల్యాబ్ టెక్నీషియన్లు-56 మంది
ఈ పోస్టులను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయనుంది.
జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో జిల్లా సెలక్షన్ కమిటీ ద్వారా ఇంటర్వ్యూలు నిర్వహించి భర్తీ చేస్తారని తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వుల్లో వెల్లడించింది. ఇందుకు సంబంధించి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖను ఆదేశించింది. గత ఏడాది కూడా ఇలాగే వైద్య సిబ్బందిని నియమించుకున్నారు. ప్రస్తుతం గత ఏడాది కంటే తీవ్రంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మరోసారి వైద్యసిబ్బంది నియామకాలపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్గా దృష్టిపెట్టింది.
కాగా, తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. శనివారం కొత్తగా 8,126 కేసులొచ్చాయి. మొత్తం కేసులు 3,95,232కి చేరాయి. కొత్తగా 3,307 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 3,30,304కి చేరింది. రికవరీ రేటు 83.57 శాతం ఉంది. రాష్ట్రంలో కొత్తగా 38 మంది మరణించారు. మొత్తం మరణాలు 1999కి చేరాయి. మరణాల రేటు 0.50 శాతం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 62,929 యాక్టివ్ కేసులున్నాయి.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.