Home /News /jobs /

TELANAGANA GOVT OFFERS FREE JOB ORIENTED TRAINING TO UNEMPLOYED WITH FREE HOSTEL AND FOOD FACILITIES NS

Telangana Free Job Training: నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ శుభవార్త.. సెల్ ఫోన్, కంప్యూటర్ రిపేర్ తో పాటు ఈ అంశాలపై ఫ్రీ ట్రైనింగ్.. భోజన, హాస్టల్ వసతితో..

తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త.. సెల్ ఫోన్, కంప్యూటర్ రిపేర్ తో పాటు ఈ అంశాలపై ఫ్రీ

తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త.. సెల్ ఫోన్, కంప్యూటర్ రిపేర్ తో పాటు ఈ అంశాలపై ఫ్రీ

తెలంగాణ (Telangana) పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. సెల్ ఫోన్ రిపేర్ (Cellphone Repair) తో పాటు పలు అంశాలపై నిరుద్యోగులకు ఉచితంగా శిక్షణ (Training) అందించనున్నట్లు తెలిపింది. అభ్యర్థులకు శిక్షణ కాలంలో ఉచిత భోజన, హాస్టల్ సదుపాయం కూడా కల్పించనుంది సర్కార్.

ఇంకా చదవండి ...
    పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ-తెలంగాణ ప్రభుత్వం వారి స్వామి రామానంద తీర్ద గ్రామీణ సంస్థ (Swamy Ramananda Tirtha Rural Institute) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. తెలంగాణ (Telangana) లోని గ్రామీణ నిరుద్యోగ యువతీ యువకులకు వివిధం అంశాల్లో ఉచితంగా హాస్టల్, భోజన వసతితో శిక్షణ అందించి ఉద్యోగం (Jobs) కల్పించనున్నట్లు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన (DDUGKY) ద్వారా నిర్వహించే ఈ ఉపాధి ఆధారిత సాంకేతిక శిక్షణ కార్యాక్రమానికి అర్మత, ఆసక్తి కలిగిన గ్రామీణ ప్రాంత అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపింది.

    శిక్షణా కార్యక్రమాల వివరాలు:
    ఆటోమొబైల్-2 మరియు 3 వీలర్ సర్వీసింగ్: టెన్త్ పాసైన వారు ఈ శిక్షణఖు అర్హులు. శిక్షణ కాల పరిమితి మూడు నెలలు.
    సెల్ ఫోన్ మరియు ఎలక్ట్రానిక్ వస్తువుల రిపైర్: టెన్త్ పాసైన వారు ఈ శిక్షణకు అర్హులు. కాల పరిమితి 4 నెలలు.
    ఎలక్ట్రీషియన్ డొమెస్టిక్ మరియు సోలార్ సిస్టమ్ ఇన్ట్సలేషన్ మరియు సర్వీస్: పదో తరగతి పాస్/ఐటీఐ వారికి ప్రాధాన్యత ఉంటుంది.
    డీటీపీ మరు ప్రింట్ పబ్లిషింగ్ అసిస్టెంట్: ఇంటర్ పాసైన వారికి అర్హత ఉంటుంది. ఈ శిక్షణ కాల పరిమితి 4 నెలలు.
    Top Demand Courses 2022: విద్యార్థులకు అలర్ట్.. ఈ ఇయర్ లో డిమాండ్ ఉన్న కోర్సులివే.. ఓ లుక్కేయండి

    ఎకౌంట్స్ అసిస్టెంట్ (ట్యాలీ): బీకామ్ పాస్ అయిన వారు అప్లై చేసుకోవచ్చు. కాల పరిమితి 3 నెలలు.
    కంప్యూటర్ హార్డ్ వేర్ అసిస్టెంట్: ఇంటర్ పాసైన వారు అర్హులు. శిక్షణ కాల పరిమితి 4 నెలలు.
    టైలరింగ్ (అసిస్టెంట్ ఫ్యాషన్ డిజైనర్): టెన్త్ పాస్/ఫెయిల్ అయిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. శిక్షణ కాల పరిమితి 6 నెలలు.
    ఐటీ కంపెనీల హెచ్ఆర్ విభాగంలో టెక్నికల్ రిక్రూటర్: బీటెక్ లేదా ఏదైనా పీజీ లేదా డిగ్రీ పాసై ఉన్న వారు ఈ విభాగంలోని శిక్షణకు అర్హులు. శిక్షణ కాల పరిమితి 3 నెలలు.
    Skill Courses: విద్యార్థులకు శుభవార్త.. NIOS ఆధ్వర్యంలో స్కిల్​ డెవలప్​మెంట్ కోర్సులు.. వివరాలివే

    ఇతర అర్హతలు:
    -అభ్యర్థుల వయస్సు 18-35 ఏళ్లు ఉండాలి.
    -అభ్యర్థులు గ్రామీణ ప్రాంతానికి చెందిన వారై ఉండాలి.
    -చదువు మధ్యలో ఉన్నవారు అర్హులు కాదు.
    కావాల్సిన పత్రాలు: అర్హతల సర్టిఫికేట్స్ మరియు జిరాక్స్ సెట్, పాస్ పోర్ట్ ఫొటోలు, ఆధార్ కార్డ్, రేషన్ కార్డు.
    -ఇంకా ఎంపికైన అభ్యర్థులు రూ.250 రిఫండబుల్ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది.


    చిరునామా: స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ గ్రామీణ సంస్థ, జలాల్ పూర్(గ్రా), పోచంపల్లి(మం), యాదాద్రి భవనగిరి జిల్లా, తెలంగాణ-508284, హైదరాబాద్-దిలుసుఖ్ నగర్ నుంచి 524 నంబర్ బస్ సౌకర్యం ఉంటుందని ప్రకటనలో తెలిపారు.
    కౌన్సెలింగ్ సమయం: జనవరి 10, ఉదయం 10 గంటలకు అభ్యర్థులు పై చిరునామాకు హాజరు కావాల్సి ఉంటుంది.
    -అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలకు 9133908000, 9948466111, 9133908222, 9948466111 నంబర్లను సంప్రదించాలని ప్రకటనలో సూచించారు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Career and Courses, Private Jobs, State Government Jobs, Telangana

    తదుపరి వార్తలు