పదో తరగతి పరీక్షలపై నేడు స్పష్టత రానుంది. సీఎం కేసీఆర్ నేతృత్వంలో జరిగే సమీక్షలో నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతానికి వాయిదా వేసిన పరీక్షలను మొత్తానికే పరీక్షలను రద్దు చేసే దిశగా సీఎం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అందరినీ పాస్ చేసే ప్రతిపాదనను సీఎంకు అధికారులు తెలియజేయనున్నారు. ట్రిపుల్ ఐటీ, గవర్నమెంట్ కాలేజీల్లో ఇంటర్ ప్రవేశాలకు పదో తరగతి ఫలితాలే కీలకం.. అందరినీ పాస్ చేస్తే ఎవరికి ఎక్కువ మార్కులు ఇవ్వాలి? ఎవరికి తక్కువ మార్కులు ఇవ్వాలి? అన్న ప్రశ్న తలెత్తుతోంది. దీనికి ఇంటర్నల్ మార్కులే సరైన మార్గం అని తెలంగాణ రికరగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్(ట్రస్మా) రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్ రావు తెలిపారు. విద్యార్థుల ఇంటర్నల్ మార్కుల ఆధారంగా ఫలితాలు ఇస్తే బాగుంటుందని ప్రభుత్వానికి సలహా ఇచ్చారు.
పంజాబ్‌లో ప్రీఫైనల్ పరీక్షలను పరిగణనలోకి తీసుకొని వార్షిక పరీక్షల ఫలితాలను వెల్లడించారని, అదే విధానాన్ని ఇక్కడ కూడా అవలంభించాలని సూచించారు. అయితే, సీఎం కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారన్నది సస్పెన్స్‌గా మారింది. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు జరిగే సమీక్షానంతరం తుది నిర్ణయాన్ని మీడియాతో చెప్పే అవకాశాలున్నాయి.
Published by:Shravan Kumar Bommakanti
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.