Indian Army Jobs | ఇండియ‌న్ ఆర్మీలో టెక్నిక‌ల్ ఉద్యోగాలు: ద‌ర‌ఖాస్తు చేసుకోండి

(ప్రతీకాత్మక చిత్రం)

ఇండియ‌న్ ఆర్మీలో ఇంజ‌నీరింగ్ విభాగంలో 134 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌లైంది. ఆర్మీలో ప‌ని చేయాల‌న్న ఉత్సాహం ఉన్న యువ‌కుల‌కు ఇదో మంచి అవ‌కాశం. ఇంజ‌నీరింగ్ విభాగంలో కోర్సులు చేసిన‌వారు ఈ పోస్టుల ద‌ర‌ఖాస్తుకు అర్హులు.

  • Share this:
    భార‌త సైన్యంలో ప‌ని చేయాల‌కునే యువ‌త‌కు అవ‌కాశం క‌ల్పిస్తూ లెఫ్ట్‌నెంట్ ర్యాక్ హోదా క‌లిగ‌ని టెక్నిక‌ల్ గ్రాడ్యుయేట్ పోస్టుల భ‌ర్తీకి ఇండియ‌న్ ఆర్మీ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. టెక్నిక‌ల్ కోర్సు చేసిన విద్యార్థులు ఈ పోస్టుకు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి అర్హులు.
    అర్హ‌త‌లు..
    వ‌య‌సు - 20 నుంచి 27 సంవ‌త్స‌రాలు ఉండాలి
    విద్యార్హ‌త - ఇంజ‌నీరింగ్ (ఫైన‌లియ‌ర్ విద్యార్థులు కూడా అర్హులు)
    ఇంజనీరింగ్ ఫైన‌ల్ ఇయ‌ర్ చ‌దువుతున్న విద్యార్థులు తాము ఫైన‌ల్ ఇయ‌ర్ చ‌దువుతున్నామ‌ని ధ్రువీక‌రించేందుకు సెమిస్ట‌ర్ రిజ‌ల్ట్ షీట్‌ల‌ను ద‌ర‌ఖాస్తులో పొందుప‌ర్చాల్సి ఉంటుంది.

    పోస్టుల వివ‌రాలు..
    మొత్తం పోస్టులు -134
    సివిల్‌/ బిల్డింగ్ క‌న్‌స్ట్ర‌క్ష‌న్ టెక్నాల‌జీ - 10
    ఆర్కిటెక్చ‌ర్ విభాగం -1
    మెకానిక‌ల్ విభాగం - 2
    ఎల‌క్ట్రిక‌ల్‌/ ఎల‌క్ట్రానిక్స్ విభాగం - 3
    కంప్యుట‌ర్ సైన్స్ అండ్ టెక్నాల‌జీ -3
    ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యునికేష‌న్ విభాగం -1
    మైక్రో ఎల‌క్ట్రానిక్స్ అండ్ మైక్రోవేవ్ -1
    ఏర‌నాటిక‌ల్, ఎరోస్పే్ విభాగంలో -1
    ఏవియానిక్స్ విభాగంలో -1
    ఎల‌క్ట్రానిక్స్ అండ్ ఇన్సుట్రుమెంటేష‌న్ -2
    ఫైబ‌ర్ ఆప్టిక్స్ -1
    ప్రొడ‌క్ష‌న్‌లో - 1
    ఇండ‌స్ట్రియ‌ల్‌/ మ్యానుఫాక్చ‌రింగ్‌/ ఇండ‌స్ట్రియ‌ల్అం డ్ మేనేజ్‌మెంట్ -1
    వ‌ర్క్‌షాప్ టెక్నాల‌జీ విభాగంలో -1

    వీటితో పాటు ప‌లు విభాగాల వివ‌రాలు వెల్ల‌డించ‌కున్నా 134 పోస్టులు భ‌ర్తీ చేయ‌నున్న‌ట్లు నోటిఫికేష‌న్‌లో వెల్ల‌డించారు. పోస్టుల సంఖ్యలో మార్పు ఉండ‌వ‌చ్చ‌ని పేర్కొన్నారు.

    ద‌ర‌ఖాస్తుకు ఆఖ‌రు తేదీ - సెప్టెంబ‌ర్ 15, 2021
    వెబ్‌సైట్ కోసం క్లిక్ చేయండి
    నోటిఫికేష‌న్ కోస్ క్లిక్ చేయండి
    Published by:Sharath Chandra
    First published: