అక్టోబ‌ర్ 25 నుంచి త‌ర‌గ‌తులు

ప్రతీకాత్మకచిత్రం

సాంకేతిక కోర్సుల త‌ర‌గ‌తుల‌కు సంబంధించి ఏఐటీసీటీఈ 2021-2022 స‌వ‌రించిన‌ క్యాలెండ‌ర్‌ను విడుద‌ల చేసింది. ఈ ఏడాది అక్టోబ‌ర్ 25 నాటి నుంచి త‌ర‌త‌గతులు ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించిన విధివిధానాల‌ను ఏఐటీసీటీఈ విడుద‌ల చేసింది.

 • Share this:
  సాంకేతిక కోర్సుల త‌ర‌గ‌తుల‌కు సంబంధించి 2021-2022 విద్యా సంవ‌త్స‌రానికి ఆల్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) తాజాగా క్యాలెండ‌ర్ విడుద‌ల చేసింది.  క‌రోనా కార‌ణంగా ఆల‌స్య‌మైన త‌ర‌గ‌తి గ‌దుల బోధ‌న విద్యార్థుల భ‌విష్య‌త్ దృష్టిలో పెట్టుకొని ఏఐటీసీటీఈ తాజా మార్గద‌ర్శ‌కాల‌ను విడుద‌ల చేసింది. అడ్మిష‌న్ ప్ర‌క్రియ, త‌ర‌గ‌తి గ‌దుల ప్రారంభంపై స్ప‌ష్ట‌త‌నిచ్చింది.    ఆగ‌స్టు 2 నుంచి స్వ‌తంత్ర‌ పీజీడీఎం/ పీజీసీఎం కళాశాల‌ల‌కు సంబంధించి కొత్త విద్యార్థుల‌కు త‌ర‌గ‌తులు ప్రారంభ‌మ‌య్యాయి. సాకేతిక విద్య‌కు సంబంధించి మొద‌టి సంవ‌త్స‌రం విద్యార్థుల‌కు త‌ర‌గ‌తులు అక్టోబ‌ర్ 25 నుంచి ప్రారంభం కానుండ‌గా రెండో సంవ‌త్స‌రం కోర్సుల్లో ప్ర‌వేశాల‌కు అక్టోబ‌ర్ 30 చివ‌రి తేదీగా ప్ర‌క‌టించింది. ఇప్ప‌టికే PGDM/PGCM కోర్సుల ప్ర‌వేశానికి సంబంధించి జూలై 10 వ‌ర‌కు ఉన్న గ‌డువును ఆగ‌స్టు 11 వ‌ర‌కు పొడిగించిన విష‌యం తెలిసిందే.
  సాకేంతిక కోర్సుల సంబంధించి సీట్ల కేటాయింపు మొద‌టి విడ‌త కౌన్సిలింగ్‌, అడ్మిష‌న్ ప్ర‌క్రియ పూర్తి చేయ‌డానికి సెప్టెంబ‌ర్ 30 వ‌ర‌కు గ‌డువు విధించింది. ఆయా సాంకేతిక కోర్సుల‌కు సంబంధించిన త‌ర‌గ‌తులు ప్రారంభించ‌డానికి చివ‌రి తీదీ అక్టోబ‌ర్ 1 గా నిర్ణ‌యించింది.
  ఓపెన్‌, దూరవిద్య/ఆన్‌లైన్ లెర్నింగ్ కోర్సుల ప్ర‌వేశానికి సెప్టెంబ‌ర్ 10, 2021గా ప్ర‌క‌టించింది. వ‌చ్చే ఏడాది ఈ కోర్సుల ప్ర‌వేశానికి ఫిబ్ర‌వ‌రి 1, 2022గా నిర్ణ‌యించింది. అలాగే ఇంజ‌నీరింగ్ విద్యార్థుల త‌ర‌గ‌తులు ప్రారంభించ‌డానికి అక్టోబర్ 25, 2021 చివ‌రి తేదీగ‌గా వెల్ల‌డించింది.
  Published by:Sharath Chandra
  First published: