భారత్‌లో టెక్ స్కిల్-బేస్డ్ ప్రోగ్రామ్‌ల కోసం అప్రివిలేజ్డ్ కమ్యూనిటీలకు చెందిన సుమారు 1 లక్ష మంది యువత నమోదు చేసుకున్నారు. టెక్ విద్యను నేర్చుకునే యువతలో క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి రంగాలకు అధిక డిమాండ్ ఉంది.
భారతదేశం (India)లో టెక్నాలజీ రోజురోజుకు ఎంతో అభివృద్ధి చెందుతోంది. భారతీయుల్లో చాలా మంది తమ టెక్ స్కిల్స్ కూడా పెంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఎడ్యునెట్ ఫౌండేషన్ ఇంపాక్ట్ యాన్యువల్ రిపోర్ట్ (Edunet Foundation Impact Annual Report) టెక్ స్కిల్లింగ్ ప్రోగ్రామ్‌ల (Tech Skilling Programmes) గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. గత రెండేళ్లుగా భారతదేశంలో టెక్ స్కిల్లింగ్ ప్రోగ్రామ్‌లు ఊపందుకున్నాయని ఈ రిపోర్టు తెలిపింది. ఈ రిపోర్టు ప్రకారం, భారత్‌లో టెక్ స్కిల్-బేస్డ్ ప్రోగ్రామ్‌ల(Programme) కోసం అప్రివిలేజ్డ్ కమ్యూనిటీలకు(Communities) చెందిన సుమారు 1 లక్ష మంది యువత నమోదు చేసుకున్నారు. టెక్ విద్యను నేర్చుకునే యువతలో క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ(Cyber Security) వంటి రంగాలకు అధిక డిమాండ్ ఉందని రిపోర్ట్ పేర్కొంది.
చాలా మంది లెర్నర్స్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అందుబాటులో లేని నేపథ్యాల నుంచి వచ్చారని నివేదిక హైలైట్ చేసింది. "ఈ గ్యాప్ ఉద్యోగాలు సాధించడంలో అసమానతను సృష్టిస్తుంది, ఇక్కడ వారు కొత్త ఉద్యోగ మార్కెట్ సృష్టించే అవకాశాలను కోల్పోతారు," అని అది జోడించింది. ఆన్లైన్ ప్రోగ్రామ్‌ల కోసం నమోదు చేసుకున్న దాదాపు 27,530 మంది పాఠశాల విద్యార్థులు... ప్రధానంగా 7 నుంచి 12 తరగతుల విద్యార్థులు.. ఇండస్ట్రీ సపోర్టెడ్ క్రెడెన్షియల్స్‌ను పొందే అవకాశం ఉందని నివేదికలో పేర్కొన్నారు. ఒక లక్ష మంది అడల్ట్ లెర్నర్స్ కెరీర్ సపోర్ట్‌తో టెక్నాలజీ స్కిల్లింగ్ ప్రోగ్రామ్‌లలో నమోదు చేసుకుని, వాటికి హాజరయ్యారని సర్వే వెల్లడించింది. 4700 కంటే ఎక్కువ పాఠశాలల నుంచి 20,000 మందికి పైగా పాఠశాల విద్యార్థులు ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ మెంటరింగ్ ద్వారా ప్రయోజనం పొందారని సర్వే చెప్పింది.
“పరిశ్రమల అంతటా సాంప్రదాయ ఉద్యోగాల వేగవంతమైన ఆటోమేషన్ కొనసాగుతోంది. అందుకే అందుబాటులో ఉన్న “కొత్త కాలర్ జాబ్స్” కోసం విద్యార్థులు తమ నైపుణ్యాలను మెరుగుపరచడం, పెంచుకోవడం అవసరం. కరోనా ఆ అవసరాన్ని వేగవంతం చేసింది. బ్లెండెడ్ లెర్నింగ్ అప్రోచ్‌తో మరింత మందికి ప్రయోజనం కల్పిస్తున్నాం. 2021లో 20 రాష్ట్రాల్లోని 8257 సంస్థలతో నేరుగా పని చేసాం. మా లబ్ధిదారుల ద్వారా దేశంలోని ఇతర ప్రాంతాలతో కూడా కలిసి పని చేశాం." అని ఎడ్యునెట్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నగేష్ సింగ్ చెప్పుకొచ్చారు.
ఎడ్యునెట్ ఫౌండేషన్ అనేది స్కిల్లింగ్, జీవనోపాధి మెరుగుదల, స్టెమ్ విద్యలో పనిచేసే నాన్ ప్రాఫిట్ సంస్థ. 2015లో స్థాపించిన ఎడ్యునెట్ ఫౌండేషన్ ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్లు 12AA, 80G కింద నమోదైంది. బెంగళూరు, గురుగ్రామ్‌లలో కేంద్ర కార్యాలయాలతో ఎడ్యునెట్ ఫౌండేషన్ పాన్ ఇండియా సంస్థగా వెలుగొందుతోంది. 43 ఇన్స్టిట్యూట్లు, 298 పూర్తయిన ప్రాజెక్ట్‌లతో టెక్ సక్షం ప్రోగ్రామ్ అనేది 2,400 మంది మహిళా విద్యార్థులను ప్రభావితం చేసిందని, టెక్నాలజీలో మంచి కెరీర్లను సంపాదించడంలో వారికి నైపుణ్యాలను పెంపొందించడంలో సహాయపడిందని సంస్థ తెలిపింది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.