Jobs: ఫ్రెషర్స్​కు గుడ్​న్యూస్​.. ఆ సంస్థలో భారీగా ఉద్యోగాలు.. వివరాలివే..

ప్రతీకాత్మక చిత్రం

భారతీయ టెక్నాలజీ దిగ్గజం టెక్ మహీంద్రా నిరుద్యోగులకు గుడ్​న్యూస్​ చెప్పింది. ఈ ఏడాది మూడు రెట్లు ఎక్కువ మంది ఫ్రెషర్స్​ను రిక్రూట్​ చేసుకుంటామని ప్రకటించింది. గత త్రైమాసికంలో టెక్​ మహీంద్రా లాభాలు గణనీయంగా వృద్ది చెందడంతో ఈ నిర్ణయం తీసుకుంది. పూర్తి వివరాలివే..

  • Share this:
భారతీయ టెక్నాలజీ దిగ్గజం టెక్ మహీంద్రా నిరుద్యోగులకు గుడ్​న్యూస్​ చెప్పింది. ఈ ఏడాది మూడు రెట్లు ఎక్కువ మంది ఫ్రెషర్స్​ను రిక్రూట్​ చేసుకుంటామని ప్రకటించింది. గత త్రైమాసికంలో టెక్​ మహీంద్రా లాభాలు గణనీయంగా వృద్ది చెందడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇదే వేగంతో కంపెనీ తన ఐటీ సేవలను విస్తరించాలని చూస్తోంది. ఆర్టిఫీషియల్​ ఇంటెలిజెన్స్​, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, స్పేస్ టెక్నాలజీ వంటి అడ్వాన్స్​ ప్రాజెక్టులను చేపట్టి, వాటిలో కొత్త వారికి అవకాశం ఇవ్వాలని భావిస్తోంది. దీనిపై టెక్ మహీంద్రా మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సిఈఓ) సి పి గుర్నాని మాట్లాడుతూ ‘‘ఫ్రెషర్స్​కి అవకాశాలు కల్పించడంలో టెక్​ మహీంద్రా ఎప్పుడూ ముందుంటుంది. గతంలో కంటే ఈ ఏడాది మూడు రెట్లు ఎక్కువ మంది ఫ్రెషర్స్​ను రిక్రూట్​ చేసుకోవాలని భావిస్తున్నాం.

జూన్​తో ముగిసిన ముగిసిన రెండో త్రైమాసికంలో 5,200 మంది ఫ్రెషర్స్​ను రిక్రూట్​ చేసుకున్నాం. తద్వారా మా ఉద్యోగుల సంఖ్య 1.26 లక్షలకు చేరింది. రాబోయే మూడో, నాలుగో త్రైమాసికంలోనూ ఇదే నియామక ధోరణి కొనసాసాగిస్తాం” అని చెప్పారు. మరోవైపు, 2021–22లో నూతన టెక్నాలజీపై పనిచేయడంపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించామని, అందుకు తగ్గట్లే ఆర్టిఫీషియల్​ ఇంటెలిజెన్స్​, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, స్పేస్ టెక్నాలజీ వంటి అడ్వాన్స్​డ్​ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు.

ఊహించని రీతిలో పెరిగిన లాభాలు..
టెక్ మహీంద్రా 2021–22 జూన్ త్రైమాసికం నికర లాభాలు 39.2 శాతం మేర పెరిగాయి. దీంతో వార్షికంగా కంపెనీ ఏకీకృత నికర లాభం రూ.1,353.2 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే కాలంలో కంపెనీ 972.3 కోట్ల నికర లాభాన్ని మాత్రమే నమోదు చేసింది. ఆ సమయంలో 11.98 శాతం వృద్ధి రేటు నమోదు చేసింది. ఈ గణాంకాలను బట్టి చూస్తే గతేడాదితో కంటే ఈ ఏడాది కంపెనీ లాభాలు ఏకంగా 25.13 శాతం మేర పెరిగాయని చెప్పవచ్చు. తద్వారా కంపెనీ మొత్తం నికర ఆదాయం రూ. 10,485 కోట్లకు చేరుకుంది. మిగిలిన ఆర్థిక సంవత్సరంలోనూ ఇదే వృద్ధిని కొనసాగిస్తామనే నమ్మకం ఉందని సీఈవో సిపి గుర్నాని చెప్పారు. కాగా, అంచనాలను సైతం తలకిందులు చేస్తూ ఊహించని రీతిలో లాభాలు ఆర్జించడంతో మంచి జోరుమీదుంది.
Published by:Veera Babu
First published: