TECH JOBS INCREASED DEMAND IN THIS SECTOR JOB OPPORTUNITIES WITH HUGE SALARIES EVK
Tech Jobs: ఈ రంగంలో పెరిగిన డిమాండ్.. భారీ వేతనాలతో ఉద్యోగ అవకాశాలు
(ప్రతీకాత్మక చిత్రం)
Crypto Jobs | భారత టెక్కీలకు గుడ్‌న్యూస్. ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న క్రిప్టో కరెన్సీ సంబంధిత వెబ్3 (Web3)ఉద్యోగాలకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దేశంలో శరవేగంగా విస్తరిస్తున్న Web3 స్టార్టప్ ఎకోసిస్టమ్‌పై క్రిప్టో కంపెనీలు, పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేస్తున్నాయి
భారత టెక్కీలకు గుడ్‌న్యూస్. ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న క్రిప్టో కరెన్సీ సంబంధిత వెబ్3 (Web3)ఉద్యోగాలకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దేశంలో శరవేగంగా విస్తరిస్తున్న Web3 స్టార్టప్ ఎకోసిస్టమ్‌పై క్రిప్టో కంపెనీలు, పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వెబ్3 జాబ్స్ (Web3 Jobs) విపరీతంగా పెరుగుతున్నాయి. Xpheno నివేదిక ప్రకారం, ఫిబ్రవరి 2022 నాటికి భారతదేశంలో 13,000 క్రిప్టో సంబంధిత ఉద్యోగాలు (Crypto Related Jobs) ఉన్నాయి. ఇది మొత్తం జాబ్ ఓపెనింగ్స్ (Job Openings)లో 4.5 శాతం. ఈ రంగంలో విపరీతమైన డిమాండ్ ఉన్నందున 10 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తులకు వెబ్3 రిలేటెడ్ జాబ్స్ రూ.78 లక్షల వరకు శాలరీ ఆఫర్ చేస్తున్నాయని Xpheno నివేదిక పేర్కొంది.
వెబ్3 అనేది ఇంటర్నెట్ నెక్స్ట్ వెర్షన్, ఇక్కడ సర్వీసెస్ బ్లాక్‌చెయిన్‌లో రన్ అవుతాయి. ఈ కాన్సెప్ట్ ఇప్పుడు బాగా పాపులర్ అవుతోంది. గత కొన్ని నెలల్లోనే అనేక వెబ్3 ప్రాజెక్టులు పుట్టుకొచ్చాయి. దీని డిమాండ్ ని బట్టి దీనివల్ల ఇండియన్ జీడీపీకి రాబోయే 11 ఏళ్లలో 1.1 ట్రిలియన్ డాలర్ల కంట్రిబ్యూషన్ అందుతుందని నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుతం సెక్యూరిటీ ఇంజనీర్, మెషీన్ లెర్నింగ్ నిపుణులు, బ్లాక్‌చెయిన్ నైపుణ్యాలు గల వ్యక్తులకు భారీ డిమాండ్ ఉంది. వెబ్3 సంబంధిత ఉద్యోగాలు చేస్తూ వీరు లక్షలు సంపాదించవచ్చు. బ్లాక్‌చెయిన్ స్పెషలిస్టు, డేటా అనాలసిస్ట్, వెబ్ డెవలపర్స్ కూడా ఏడాదికి లక్షల్లో డబ్బులు సంపాదించవచ్చు.
ఫిబ్రవరి 2022 నాటికి వెబ్3 సెక్టార్లో 13,000 యాక్టివ్ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అంటే గత మూడు నెలల్లో 18 శాతం వృద్ధి నమోదయింది. బెంగళూరు, ముంబై క్రిప్టో ఉద్యోగాలకు హాట్స్పాట్లుగా కొనసాగుతున్నాయి. ఆ తర్వాత ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, పుణే ఉన్నాయి. ఈ మహా నగరాలు క్రిప్టో, బ్లాక్‌చెయిన్ స్పేస్‌లో దాదాపు 74 శాతం యాక్టివ్ ఓపెనింగ్లను కలిగి ఉన్నాయని నివేదిక పేర్కొంది. ఐటీ సర్వీసెస్ & బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ రంగం బ్లాక్‌చెయిన్, క్రిప్టోలో టాలెంటెడ్ వ్యక్తులను ఎక్కువగా హైర్ చేసుకుంటున్నాయి. ప్రస్తుత జాబ్ ఓపెనింగ్స్ లో ఈ రంగం నుంచి 39 శాతం ఓపెనింగ్లు ఉన్నాయని నివేదిక పేర్కొంది. అయితే, నియామకం ఓవర్సీస్ క్రిప్టో, బ్లాక్‌చెయిన్ వెంచర్లు నిర్వహిస్తాయి. కన్సల్టింగ్, డిజైన్, డెవలప్మెంట్, సపోర్ట్ సర్వీసెస్ వంటి ఉద్యోగాల విషయంలో ఓవర్సీస్ క్రిప్టో, బ్లాక్‌చెయిన్ వెంచర్లు కీలక రోల్ ప్లే చేస్తాయి.
వెబ్3కి పెరుగుతున్న డిమాండ్‌తో పాటు ఆ రంగంలోని ఉద్యోగాల శాలరీలు కూడా పెరుగుతున్నాయి. ముఖ్యంగా నిష్ (niche) నైపుణ్యాలు ఉన్న టాప్ టాలెంటెడ్ పర్సన్లకు వెబ్3 ఉద్యోగాలు రూ.80 లక్షల వరకు శాలరీలు ఆఫర్ చేస్తున్నాయి. బ్లాక్‌చెయిన్ లో 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఎక్స్ పర్ట్స్ అయితే వారు సంవత్సరానికి రూ. 32 లక్షలు సంపాదించవచ్చు. 8-12 సంవత్సరాల అనుభవం ఉన్న ఎక్స్ పర్ట్స్ కి సంవత్సరానికి ఏకంగా రూ.78 లక్షలు వరకు శాలరీ ఆఫర్ చేస్తున్నాయి వెబ్3 కంపెనీలు.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.