Microsoft: విండోస్ 7 యూజర్లకు షాక్.. త్వరలో..

Microsoft: ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం ఉన్న పీసీ లేదా ల్యాప్‌టాప్ కొనాల్సి ఉందని తెలిపింది.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: June 20, 2019, 2:03 PM IST
Microsoft: విండోస్ 7 యూజర్లకు షాక్.. త్వరలో..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. 2020 జనవరి 14 నుంచి విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టంకు సెక్యూరిటీ, టెక్నికల్ అప్‌డేట్స్‌ను నిలిపివేస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది. గడువు తర్వాత ఈ ఓఎస్‌తో ఉన్న కంప్యూటర్లను వినియోగించడం వల్ల సమస్య వస్తుందని, కొత్త సాఫ్ట్‌వేర్‌కు మారిపోవాలని వినియోగదారులకు సూచించింది. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం ఉన్న పీసీ లేదా ల్యాప్‌టాప్ కొనాల్సి ఉందని తెలిపింది. యూజర్లు సులభంగా కొత్త ఓఎస్‌కు మారేలా బైబ్యాక్‌, ఎక్స్చేంజ్‌ ఆఫర్లు ప్రకటించడంతో పాటు చౌకగా డివైస్‌లను తయారు చేసేలా డెల్‌, హెచ్‌పీ వంటి కంప్యూటర్స్ తయారీ సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు మైక్రోసాఫ్ట్‌ వివరించింది.
Published by: Shravan Kumar Bommakanti
First published: June 20, 2019, 2:02 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading