TEAM LEASE EDTECH TEAM LEASE ADTECH GOOD NEWS FOR POOR STUDENTS APPRENTICESHIP EMBEDDED DEGREE COURSE OFFER GH VB
Team Lease EdTech: పేద విద్యార్థులకు టీమ్‌లీజ్ ఎడ్‌టెక్ గుడ్‌న్యూస్.. ఆ డిగ్రీ కోర్సు ఆఫర్..! వివరాలిలా..
ప్రతీకాత్మక చిత్రం
ప్రముఖ ఎడ్‌టెక్ కంపెనీ టీమ్ లీజ్ (TeamLease EdTech).. వర్కర్స్ యూనియన్ సపోర్ట్ (WUS)తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. ఈ ఒప్పందంలో భాగంగా తక్కువ ఆదాయం ఉన్న కార్మికులు, వారిపై ఆధారపడినవారి కోసం తక్కువ ఖర్చుతో ఉన్నత విద్యా కార్యక్రమం ‘పధై భీ -కమై భీ’ (Padhai Bhi-Kamai Bhi) ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది.
ప్రముఖ ఎడ్‌టెక్ కంపెనీ టీమ్ లీజ్ (TeamLease EdTech).. వర్కర్స్ యూనియన్ సపోర్ట్ (WUS)తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. ఈ ఒప్పందంలో భాగంగా తక్కువ ఆదాయం ఉన్న కార్మికులు, వారిపై ఆధారపడినవారి కోసం తక్కువ ఖర్చుతో ఉన్నత విద్యా కార్యక్రమం ‘పధై భీ -కమై భీ’ (Padhai Bhi-Kamai Bhi) ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ‘వర్కర్స్ యూనియన్ సపోర్ట్’ భాగస్వామ్యంతో టీమ్‌లీజ్ ఎడ్‌టెక్ ‘అప్రెంటిస్‌షిప్ ఎంబెడెడ్ డిగ్రీప్రోగ్రామ్లను’ అందించనుంది. తద్వారా విద్యార్థులు ఉద్యోగాన్ని సంపాదించేటప్పుడు పరిశ్రమ అనుభవాన్ని ఇస్తూనే అండర్ గ్రాడ్యుయేట్ లేదా మాస్టర్స్ డిగ్రీని పొందేందుకు వీలు కల్పిస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా వర్క్ ఎక్స్‌ఫీరియన్స్‌తో పాటు ఆర్థిక సహాయాన్ని అందించనున్నాయి. దీంతో ఉన్నత విద్యను మరింత అందుబాటులోకి అందులోనూ తక్కువ ఖర్చుతో వస్తుంది. అదే సమయంలో యువత ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపడనున్నాయి.
ఈ సందర్భంగా వర్కర్స్ యూనియన్ సపోర్ట్ వ్యవస్థాపకుడు & సీఈవో ప్రసూన్ శర్మ మాట్లాడుతూ... కార్మిక శక్తిలో ఐదుగురు భారతీయుల్లో ఒకరు నైపుణ్యం కలిగి ఉన్నారని అన్నారు. 20 సంవత్సరాలకు పైగా TeamLease ఉద్యోగ వేటలో ఉన్నవారికి ఉద్యోగాలు ఇచ్చే సంస్థల మధ్య వారధిగా పనిచేస్తోందన్నారు. వర్కర్ యూనియన్ సపోర్ట్ (WUS) గత 40 సంవత్సరాలుగా తక్కువ-మధ్యస్థ ఆదాయ (LMI) కార్మికులకు సాధికారత కలిగిన టీంతో వారికి అన్ని రకాలుగా మద్దతునిస్తోందన్నారు.టీమ్ లీజ్ Edtech - WUS మధ్య అనుబంధంతో కార్మికులు తమ విద్య, నైపుణ్యాలను అప్‌గ్రేడ్ చేసుకునే అవకాశం దొరికిందని ప్రసూన్ అభిప్రాయపడ్డారు.
ఈ రెండు సంస్థల చొరవపై నీతి అయోగ్ మాజీ చైర్మన్ డాక్టర్ రాజీవ్ కుమార్ స్పందించారు. ఇలాంటి భాగస్వామ్యాలు విషయాలను ముందుకు తీసుకెళ్లడంలో సహాయపడతాయన్నారు. ఈ నెట్‌వర్క్‌లో కార్మికులు, శిక్షకులతో సహా 400+ యజమానులు, 45 కంటే ఎక్కువ యూనివర్సిటీలు భాగమయ్యాయని, అవన్నీ కలిస్తే గొప్ప శక్తిని సృష్టిస్తుందన్నారు. నైపుణ్యం, సరైన శిక్షణలేని కార్మికులు దాదాపు 83 శాతం మంది ఉన్నారని.. ఇ సంఖ్యను బాగా తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రస్తుతం శ్రామికశక్తిలోకి ప్రవేశించే కార్మికులు మాత్రమే శిక్షణ పొందుతున్నారని, అయితే ఇప్పటికే వ్యవస్థలో ఉన్న కార్మికులు నైపుణ్యం సాధించడం లేదని ఆయన పేర్కొన్నారు. ఈ అంతరాన్ని వీలైనంత తగ్గించేందుకు ఈ రెండు సంస్థలు కీలకమైన చొరవ తీసుకున్నాయన్నారు. ఈ విషయంలో ఈ రెండు సంస్థలను రాజీవ్ కుమార్ అభినందించారు. ప్రతి ఒక్కరూ అప్రెంటిస్‌షిప్, విద్యపై సమాన శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందని... ఒక వేళ అలా చేయకపోతే నైపుణ్యం కలిగిన వర్క్‌ఫోర్స్‌తో పరిశ్రమ డిమాండ్‌ను పోల్చడం కష్టసాధ్యమవుతుందన్నారు. ఈ అవకాశాన్ని తాను కూడా వినియోగించుకోవాలని అనుకుంటున్నట్లు రాజీవ్ కుమార్ వెల్లడించారు.
అప్రెంటిస్‌షిప్ ఎంబెడెడ్ డిగ్రీ కోర్సుల ద్వారా విద్యార్థులు లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ మొత్తంగా 75 ప్రోగ్రామ్‌లను ఎంచుకోవడానికి అవకాశం ఉంటుంది. సాఫ్ట్ స్కిల్స్, ఫైనాన్షియల్ స్కిల్స్, లీడర్‌షిప్ స్కిల్స్, మార్కెటింగ్ స్కిల్స్ వంటి వాటి పరిధిలోకి వచ్చే కోర్సుల నుండి విద్యార్థులు ప్రయోజనం పొందవచ్చు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.