ఇందిరాగాంధీ ఢిల్లీ టెక్నికల్ యూనివర్శిటీ ఫర్ ఉమెన్ (Indira Gandhi Delhi Technical University for Women) టీచింగ్, నాన్‌టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఆసక్తిగల వారు IGDTUW రిక్రూట్‌మెంట్ వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకొన్న వారి అర్హతలు(Eligibility) పరిశీలించి ఇంటర్వ్యూ(Interview) ద్వారా ఖాళీను భర్తీ చేస్తారు. పోస్టులకు సంబంధించిన అర్హతలు, ఎంపిక విధానం ఇలా ఉన్నాయి.
పోస్టుల వివరాలు..
1) ప్రొఫెసర్ పోస్టులు - 11
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ -02
కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ -03
ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ -01
మెకానికల్ & ఆటోమేషన్ ఇంజనీరింగ్ -02
ఆర్కిటెక్చర్ మరియు ప్లానింగ్- 02
ఇంగ్లీష్ -01
2) అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు - 17
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ -07
కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ -04
ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ -01
మెకానికల్ & ఆటోమేషన్ ఇంజనీరింగ్ -02
ఆర్కిటెక్చర్ మరియు ప్లానింగ్ -02
గణితం -01
3) అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు -19
కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ -09
ఆర్కిటెక్చర్ మరియు ప్లానింగ్ -04
భౌతికశాస్త్రం -01
కెమిస్ట్రీ -01
4) నాన్ టీచింగ్/ మినిస్టీరియల్ - 05
కంట్రోలర్ ఆఫ్ ఎక్జామినర్ -01
డిప్యూటీ రిజిస్ట్రార్ -01
అసిస్టెంట్ రిజిస్ట్రార్ -02
అసిస్టెంట్ కంట్రోలర్ ఆఫ్ ఎక్జామినర్ -01
విద్యార్హతలు: వివిధ పోస్టులకు బీటెక్(Btech), ఎంటెక్‌తో పాటు పీహెచ్‌డీ(Phd) చేసిన అభ్యర్థులు అర్హులు. అంతే కాకుండా ప్రతీ విభాగానికి ప్రత్యేకంగా ఆ రంగంలో పని చేసిన అనుభవం ఉండాలి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
దరఖాస్తు చేసే విధానం..
Step 1: అభ్యర్థులు ఆన్‌లైన్(Online) ద్వారానే దరఖాస్తు చేసుకోవాలి. (దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Step 2: ముందుగా అభ్యర్థులు ఆన్‌లైన్ పోర్టల్‌లో లాగిన్ అవ్వాలి.
Step 3: దరఖాస్తులో ఏ పోస్టుకు దరఖాస్తుచేస్తున్నారో ఇవ్వాలి.
Step 4: టీచింగ్ స్టాఫ్‌కు నాన్ టీచింగ్ స్టాఫ్‌కు వేరువేరు నోటిఫికేషన్(Notification)లు ఇచ్చారు. గమనించాలి.
Step 5: దరఖాస్తు ఫాంను నింపిన తరువాత సబ్‌మిట్ కొట్టి ప్రింట్ తీసుకోవాలి. ఇందుకు చివరి తేదీ అక్టోబర్ 10, 2021 వరకు అవకాశం.
Step 6: దరఖాస్తు చేసుకొన్న అనంతరం దరఖాస్తు(Application) ఫాంను ప్రింట్ తీసుకొని కింది అడ్రస్‌కు పంపాలి.
Office of the Additional Registrar (HR), Indira Gandhi Delhi Technical University for
Women, First Floor, Administrative Block, Kashmere Gate, Delhi-110 006
దరఖాస్తు అడ్రస్‌కు చేరుకొనేందుకు ఆఖరు తేదీ అక్టోబర్ 11, 2021
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Government jobs