భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు (Defence Ministry) చెందిన ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లోని (Army Public School) పలు ఉద్యోగాలను (Jobs) భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ మేరకు స్కూల్ అధికారులు నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేశారు. మొత్తం 41 ఖాళీలను (Jobs) భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలకు ఆఫ్ లైన్ విధానంలో పోస్టు ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి మే 25, 2022ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా తమ దరఖాస్తులు చేరేలా పంపించాల్సి ఉంటుంది.
ఖాళీలు..
పోస్టు | ఖాళీలు |
పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్(PGT) | 15 |
ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ TGT | 20 |
ప్రైమరీ టీచర్స్ PRT | 06 |
మొత్తం | 41 |
విద్యార్హతల వివరాలు..
పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్(PGT): సంబంధిత సబ్జెక్టులో 50 శాతం మార్కులతో పీజీ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. కెఇంగ్లీష్, హిస్టరీ, జాగ్రఫీ, పొలిటికల్ సైన్స్, మ్యాథమెటిక్స్ కెమిస్ట్రీ, ఫిజిక్స్, సైకాలజీ లో ఖాళీలు ఉన్నాయి.
ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ TGT: హిందీ, సంస్కృతం, సోషల్ సైన్స్, కంప్యూటర్ సైన్స్, ఇంగ్లీష్, ఫిజిక్స్ లో ఖాళీలు ఉన్నాయి. సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్ తో పాటు బీఈడీ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.
పీఆర్టీ: ప్రైమరీ క్లాసెస్ విద్యార్థులకు అన్ని సబ్జెక్టులు బోధించడానికి 25 మంది టీచర్ల ఖాళీలు ఉన్నాయి. గ్రాడ్యుయేషన్ తో పాటు బీఈడీ/డీ.ఈ.ఈడీ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేయాల్సి ఉంటుంది.
ఎలా అప్లై చేయాలంటే..
Step 1: అభ్యర్థులు మొదటగా ఈ లింక్ ద్వారా అధికారిక వెబ్ సైట్ ఓపెన్ చేయాలి.
Step 2: అనంతరం హోం పేజీలో vacancies లింక్ పై క్లిక్ చేయాలి.
Step 3: కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో ఖాళీలు, విద్యార్హతల వివరాలు ఉంటాయి. ఆ వివరాలను పూర్తిగా చదివిన అనంతరం APPLICATION FORM ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
Step 4: అనంతరం మీకు అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఆ ఫామ్ లో సూచించిన వివరాలను పూర్తిగా నింపాలి.
Step 5: ఆ ఫామ్ ను ప్రిన్సిపల్, ఆర్మీ పబ్లిక్ స్కూల్ బొల్లారం, జేజే నగర్ పోస్ట్, సికింద్రాబాద్ - 500087 చిరునామాకు మే 25, 2022 లోగా పంపించాల్సి ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Job notification, JOBS, Teaching