TEACHERS ASSOCIATESHIP FOR RESEARCH EXCELLENCE 2022 ELIGIBLE CANDIDATES TO GET RS 60000 PER YEAR CHECK DETAILS GH VB
Application Invited: వాళ్లు ఏడాదికి రూ.60 వేలు పొందే అవకాశం.. దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 15.. వివరాలివే..
ప్రతీకాత్మక చిత్రం
రాష్ట్ర విశ్వవిద్యాలయాలు/క ళాశాలలు, ప్రైవేట్ విద్యాసంస్థలలో రెగ్యులర్ విధానంలో పనిచేస్తున్న అధ్యాపకులను రీసెర్చ్‌లో ప్రోత్సహించేందుకు టీచర్స్ అసోసియేట్‌షిప్ ఫర్ రీసెర్చ్ ఎక్సలెన్స్ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది కేంద్రం.
రాష్ట్ర విశ్వవిద్యాలయాలు/కళాశాలలు, ప్రైవేట్ విద్యాసంస్థలలో రెగ్యులర్(Regular) విధానంలో పనిచేస్తున్న అధ్యాపకులను రీసెర్చ్‌లో(Research) ప్రోత్సహించేందుకు టీచర్స్ అసోసియేట్‌షిప్ ఫర్ రీసెర్చ్ ఎక్సలెన్స్ స్కీమ్‌ను(Scheme) ప్రవేశపెట్టింది కేంద్రం. దీని కింద అర్హులైన అభ్యర్థులకు సంవత్సరానికి రూ. 60 వేల స్టైఫండ్ అందజేస్తుంది. కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ఐఐటీ(IIT), ఐఐఎస్సీ, ఐఐఎస్ఈఆర్ఎస్, ఎన్ఐటీలు(NIT), సీఎస్ఐఆర్, ఐసీఏఆర్(ICAR), ఐసీఎంఆర్ ల్యాబ్‌లు, సెంట్రల్ యూనివర్సిటీల్లో(Central University) పనిచేస్తున్న ఫ్యాకల్టీకి ఈ అసోసియేట్‌షిప్ వర్తిస్తుంది. అర్హత గల అభ్యర్థులు టీచర్స్ అసోసియేట్‌షిప్ ఫర్ రీసెర్చ్ ఎక్సలెన్స్ కోసం మార్చి 15లోపు దరఖాస్తు చేసుకోవాలి.
టీచర్స్ అసోసియేట్‌షిప్‌కు అర్హత
దరఖాస్తుదారులు తప్పనిసరిగా రాష్ట్ర విశ్వవిద్యాలయాలు/కళాశాలలు, ప్రైవేట్ విద్యాసంస్థలలో టీచింగ్ వృత్తిలో ఉండాలి.
దరఖాస్తు సమర్పించే సమయంలో దరఖాస్తుదారుడు పరిశోధన ప్రాజెక్టులు లేదా ఏదైనా ఫెలోషిప్‌ను కలిగి ఉండకూడదు.
అభ్యర్థుల గరిష్ట వయోపరిమితి 45 సంవత్సరాలు. SC/ST/OBC/ఫిజికల్లీ ఛాలెంజ్డ్ & మహిళా అభ్యర్థులకు చెందిన అభ్యర్థులకు 5 (ఐదు) సంవత్సరాల సడలింపు ఇవ్వబడుతుంది.
మెంటర్ అసోసియేట్ ప్రొఫెసర్/సైంటిస్ట్ E స్థాయిలో లేదా అంతకంటే ఎక్కువ స్థాయిలో పనిచేస్తూ ఉండాలి.
ఏ సమయంలోనైనా మెంటర్‌తో కలిసి పనిచేయడానికి సిద్దంగా ఉండాలి.
బహుమతులు & రివార్డ్‌లు
సంవత్సరానికి కనీసం 90 రోజుల పరిశోధన పనిని పూర్తి చేసిన తర్వాత రూ. 60,000- రీసెర్చ్ ఫెలోషిప్ అందజేస్తారు. పరిశోధన గ్రాంట్ కింద రూ. సంవత్సరానికి 5 లక్షలు అందజేస్తారు.
దరఖాస్తు ప్రక్రియ
అభ్యర్థులు www.serbonline.in, www.serb.gov.in వెబ్సైట్ల ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. లాగిన్ అయిన తర్వాత, యూజర్ ప్రొఫైల్ కింద ప్రొఫైల్ వివరాల విభాగంలో అన్ని తప్పనిసరి ఫీల్డ్‌లను పూరించాలి. ఇందులో బయో-డేటా, ఫోటో, ఇన్స్టిట్యూట్ అడ్రస్ మొదలైన వివరాలు అందజేయాలి.
ప్రాజెక్ట్ ప్రతిపాదన సారాంశాన్ని నమోదు చేయాలి. ప్రాజెక్ట్ శీర్షిక (గరిష్టంగా 500 అక్షరాలు), ప్రతిపాదిత పని సారాంశం (గరిష్టంగా 3000 అక్షరాలు), కీలక పదాలు (గరిష్టంగా 6), ప్రాజెక్ట్ లక్ష్యాలు (గరిష్టంగా 1500 అక్షరాలు), ప్రతిపాదన ఊహించిన అవుట్‌పుట్, ఫలితం (గరిష్టంగా 1500 అక్షరాలు) ఉండాలి.
ప్రతిపాదన ఇతర సంబంధిత సమాచారం తప్పనిసరిగా ఒకే పీడీఎఫ్ ఫైల్‌లో 10 MB కంటే ఎక్కువ సైజ్‌లో ఉండాలి.
కావాల్సిన డాక్యుమెంట్లు
దరఖాస్తుదారు బయోడేటా
ప్రతిపాదన ఇతర సాంకేతిక వివరాలు
పరిశోధకుడి నుండి సర్టిఫికేట్
యూనివర్సిటీ డీన్తి నుండి ఎండార్స్‌మెంట్ సర్టిఫికేట్
యూనివర్సిటీ నుండి ఎండార్స్‌మెంట్ లెటర్
మెంటర్‌కు సంబంధించిన రెజ్యూమ్
కేటగిరీ సర్టిఫికేట్
ఏజ్ ప్రూఫ్ సర్టిఫికేట్
జాయినింగ్ రిపోర్ట్
ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 90 రోజుల హాజరు ధ్రువీకరణ పత్రం.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.