TEACHER RACISM COMMENTS ON STUDENT ON ZOOM CALL CREATES CONTROVERSY SS GH
Zoom Call: జూమ్ కాల్లో విద్యార్థిపై రేసిజం వ్యాఖ్యలు చేసిన టీచర్... ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Zoom Call: జూమ్ కాల్లో విద్యార్థిపై రేసిజం వ్యాఖ్యలు చేసిన టీచర్... ఆ తర్వాత ఏం జరిగిందంటే?
(ప్రతీకాత్మక చిత్రం)
Zoom Call controversy | కరోనా ప్రభావం మొదలైనప్పటి నుంచి అన్ని చోట్లా జూమ్ కాల్స్ కొనసాగుతున్నాయి. అన్ని పనులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే పూర్తి చేస్తున్నారు. ఈ జూమ్ కాల్స్ వివాదాలకు కూడా దారితీస్తున్నాయి.
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా విద్యాభోధన అంతా ఆన్లైన్లోనే జరుగుతుంది. ఆన్లైన్ క్లాసులు విద్యార్థులకు ఎంత వరకు తలకెక్కుతున్నాయో తెలియదు కానీ.. దీనితో లేనిపోని తలనొప్పులు మాత్రం అధికమవుతున్నాయి. తాజాగా అమెరికాలోని రేసిజంకు జూమ్ కాల్ కూడా కేంద్ర బిందువైంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కటురా స్టోక్స్ అనే మహిళకు 12 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. అతడు సౌత్ కాలిఫోర్నియా పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. కరోనాతో ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తుండంతో అతని సైన్స్ టీచర్ కింబర్లీ న్యూమాన్ జూమ్ కాల్లో క్లాసులు నిర్వహించింది. అయితే, క్లాసు ముగిసినప్పటికీ టీచర్, స్టూడెంట్ ఇద్దరూ ఈ జూమ్ కాల్ నుంచి వైదొలగడం మర్చిపోయారు. దీంతో, దాదాపు 30 నిమిషాల పాటు టీచర్ మాట్లాడిన వ్యాఖ్యలు అలాగే రికార్డయ్యాయి.
ఆ సమయంలో కింబర్లీ న్యూమాన్ ఆ విద్యార్థి కుటుంబాన్ని ఉద్దేశించి తీవ్ర స్థాయిలో రేసిజం కామెంట్స్ చేసింది. ‘‘ఈ నల్ల జాతీయులుకు కనీస సంస్కారం ఉండదు. టెక్నాలజీపై కనీస అవగాహన ఉండదు. సోమరిపోతులు.”అంటూ కామెంట్స్ చేసింది. ఈ వ్యాఖ్యలన్నీ జూమ్ కాల్లో రికార్డయ్యాయి. దీంతో, ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థి తల్లి స్టోక్స్ పాఠశాల ఉన్నఅధికారులకు టీచర్‌పై ఫిర్యాదు చేసింది. దీంతో వారు వెంటనే స్పందించి సదరు టీచర్‌ను అదే రోజు సస్పెండ్ చేశారు. టీచర్ సస్పెన్షన్‌పై పామ్డేల్ స్కూల్ డిస్ట్రిక్ట్ ప్రతినిధి డేవిడ్ గార్సియా మాట్లాడుతూ..‘‘ఈ సంఘటనపై దర్యాప్తు చేపట్టాం. కానీ, మా దర్యాప్తుకు న్యూమాన్ సహకరించడానికి నిరాకరించింది. మేము ఆమెను దర్యాప్తు కి పిలిచిన కొద్దిసేపటికే రాజీనామా చేసింది” అని అన్నారు. కాగా, టీచర్ తన కుటుంబంపై చేసిన రేసిజం కామెంట్స్‌తో మేము మానసిక క్షోభకు గురయ్యామని, సదరు పాఠశాల అధికారులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ స్టోక్స్ కోర్డులో దావా వేసింది. సదరు టీచర్ నిర్లక్ష్యం, పరువు నష్టం, పౌర హక్కుల ఉల్లంఘనలకు పాల్పడిందని దావాలో పేర్కొంది.
స్టోక్స్ తరఫున వాదిస్తున్న న్యాయవాదుల్లో ఒకరైన నీల్ కె. గెహ్లావత్ మాట్లాడుతూ ‘‘జాత్యాహంకార వ్యాఖ్యల పట్ల న్యాయం కోసం స్టోక్స్ మమల్ని సహాయం కోరింది. ఇలా టీచర్లు విద్యార్థుల పట్ల వర్ణ వివక్ష చూపించడం అతి దారుణమైన విషయం. దీనితో, చిన్నతనంలోనే విద్యార్థులు మానసిక క్షోభకు గురయ్యే ప్రమాదం ఉంది. ఇది చాలా బాధ కలిగించే సంఘటన. స్టోక్స్‌కు న్యాయం జరిగే వరకు చివరి వరకు పోరాడుతాం.”అని అన్నారు. కాగా, లాస్ ఏంజిల్స్‌కు ఉత్తరాన ఉన్న పామ్డేల్లోని డిస్టిక్ట్ స్టూల్లో జాత్యహంకార సంఘటనలు జరగడం ఇది మొదటిసారేమీ కాదు. 2019లో బ్లాక్ విద్యార్థులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను నలుగురు ఉపాధ్యాయులు, మరొక పాఠశాలలో ఒక ప్రిన్సిపాల్ సస్పెండ్ అయ్యారు. అయినప్పటికీ, ఇలాంటి ఘటనలు పునరావృతం అవతుండటం ఆందోళన కలిగిస్తోంది.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.