హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Success Story: టీ అమ్మే వ్యక్తి కుమారుడికి CA ఫైనల్ రిజల్ట్స్‌లో ఆలిండియా 10వ ర్యాంక్ .. అతడి సక్సెస్‌ స్టోరీ ఇదే..

Success Story: టీ అమ్మే వ్యక్తి కుమారుడికి CA ఫైనల్ రిజల్ట్స్‌లో ఆలిండియా 10వ ర్యాంక్ .. అతడి సక్సెస్‌ స్టోరీ ఇదే..

వైభవ్ మహేశ్వరి

వైభవ్ మహేశ్వరి

టీ విక్రయిస్తూ కుటుంబాన్ని పోషించే వ్యక్తి కుమారులు ఇద్దరూ చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ అయ్యారు. అతని రెండో కుమారుడు ఇటీవలే ప్రకటించిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) CA తుది ఫలితాల్లో ఆలిండియా 10వ ర్యాంక్ సాధించాడు.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

Success Story: ఇండియాలో నిర్వహించే అత్యంత కఠినమైన ఎగ్జామ్స్‌లో ప్రొఫెషనల్ కోర్సు CA ఫైనల్ పరీక్షలు టాప్‌లో ఉంటాయి. ఏటా చాలా తక్కువమంది మాత్రమే ఈ పరీక్షలో క్వాలిఫై అవుతారు. అయితే చాలామంది సాధారణ నేపథ్యం ఉన్నవారు కూడా సీఏ పాస్ అవుతూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా టీ విక్రయిస్తూ కుటుంబాన్ని పోషించే వ్యక్తి కుమారులు ఇద్దరూ చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ అయ్యారు. అతని రెండో కుమారుడు ఇటీవలే ప్రకటించిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) CA తుది ఫలితాల్లో ఆలిండియా 10వ ర్యాంక్ సాధించాడు. 2022 నవంబర్‌లో నిర్వహించిన CA ఫైనల్ ఎగ్జామ్‌లో 800 మార్కులకు 589 మార్కులు సాధించి సత్తా చాటాడు వైభవ్ మహేశ్వరి జాస్. అత్యంత కఠినంగా భావించే సీఏ ఫైనల్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరచిన వైభవ్‌ సక్సెస్ స్టోరీ, ప్రిపరేషన్‌ స్ట్రాటజీ గురించి తెలుసుకుందాం.

వైభవ్ మహేశ్వరి జాస్‌ది రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన కుటుంబం. తండ్రి జైపూర్‌లోని మానసరోవర్‌లోని ఒక చిన్న రెస్టారెంట్‌లో టీ, కచోరీ అమ్ముతారు. ఆర్థికంగా బలమైన నేపథ్యం కాకపోయినా వైభవ్‌ చిన్నప్పటి నుంచి చదువుపై చూపిన శ్రద్ధ, తాజాగా సాధించిన విజయంపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

రిఫ్రెష్‌ అవ్వడానికి వెబ్‌ సిరీస్‌, వాకింగ్‌

సీఏ పరీక్షలో విజయం సాధించేందుకు చాలా కష్టపడ్డానని, రోజుకు దాదాపు 10 గంటలు ఎగ్జామ్‌ ప్రిపరేషన్‌కు వెచ్చించానని వైభవ్‌ తెలిపాడు. CA ఎగ్జామ్స్‌ ప్రిపరేషన్‌ గురించి వైభవ్ మాట్లాడుతూ.. ‘రోజూ దాదాపు 10 గంటలు కూర్చుని చదవాలంటే చాలా పట్టుదల అవసరం. నేను బాగా అలనిసోయినట్లు ఫీల్‌ అయినప్పుడు, రిలీఫ్‌ కోసం OTTలో వెబ్ సిరీస్‌ని చూసేవాడిని. సోషల్ మీడియాకు కూడా కొంత సమయం కేటాయించాను. ఒత్తిడి పెరగకుడా, మానసికంగా ప్రశాంతంగా ఉండటానికి ఇరుగుపొరుగు కుటుంబ సభ్యులతో కలిసి వాకింగ్‌ చేశాను. రిఫ్రెష్‌ అయిన తర్వాత మరింత ఉత్సాహంతో ప్రిపరేషన్‌ కొనసాగించవచ్చు’ అని తెలిపాడు

అన్నయ్య కూడా సీఏ

వైభవ్‌ అన్నయ్య వరుణ్ కూడా చార్టర్డ్ అకౌంటెంట్. అతడు రెండు సంవత్సరాల క్రితం CA పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. దీంతో అప్పటి వరకు ఉన్న ఆర్థిక కష్టాల నుంచి కుటుంబం గట్టెక్కింది. వైభవ్‌ మహేశ్వరికి చదువుతోపాటు ఫిట్నెస్‌ అంటే కూడా చాలా ఇష్టం. శారీరకంగా దృఢంగా ఉండేందుకు ఫుట్‌బాల్, క్రికెట్ ఆడేవాడు. ఇకపై తానూ సంపాదిస్తానని, అన్నయ్యకు తోడుగా తండ్రి కలలను నెరవేరుస్తానని వైభవ్‌ సంతోషం వ్యక్తం చేశాడు. తండ్రి కుటుంబ పోషణకు ఇప్పటి వరకు చాలా కష్టపడ్డారని, ఆయన పని వదిలేసి ప్రశాంతంగా జీవించాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు.

Success Story: విజయం సాధించే వరకు సొంతూరికీ వెళ్లలేదు.. UPSC ISS ర్యాంకర్‌, కార్పెంటర్‌ కుమారుడి సక్సెస్‌ స్టోరీ..

సీఏ ఫైనల్‌ పరీక్షల్లో 11.09 మంది ఉత్తీర్ణత

ICAI CA ఇంటర్ పరీక్షలు నవంబర్ 2 నుంచి 17 వరకు జరిగాయి. అయితే CA ఫైనల్ ఎగ్జామ్‌ నవంబర్ 1న నిర్వహించారు. మొత్తం 11.09 శాతం మంది విద్యార్థులు ఫైనల్ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు. 12.72 శాతం మంది ఇంటర్ పరీక్షల్లో అర్హత సాధించారని ఓ వార్తా పత్రిక తెలిపింది. మొత్తం 12,825 మంది అభ్యర్థులు సీఏ పరీక్షల్లో అర్హత సాధించారు. సీఏ ఫైనల్ పరీక్షల్లో హర్ష్ చౌదరి అనే విద్యార్థి 800 మార్కులకు 618 మార్కులతో టాపర్‌గా నిలిచాడు. సీఏ ఇంటర్మీడియట్ పరీక్షలో దీక్షా గోయల్ అత్యధిక మార్కులు సాధించి మొదటి స్థానం దక్కించుకున్నాడు.

First published:

Tags: Ca exams, CAREER, Rajasthan

ఉత్తమ కథలు