హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

TCS: టీసీఎస్ కీలక ప్రకటన..70 శాతం మంది ఉద్యోగులకు వంద శాతం వేరియబుల్ పే!

TCS: టీసీఎస్ కీలక ప్రకటన..70 శాతం మంది ఉద్యోగులకు వంద శాతం వేరియబుల్ పే!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

భారతదేశపు అతిపెద్ద టెక్ దిగ్గజం టీసీఎస్ (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్-TCS) కంపెనీ తాజాగా కీలక ప్రకటన చేసింది. ఇటీవల లాభాలను ప్రకటించిన ఈ సంస్థ.. 2022-23 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో 70 శాతం మంది ఉద్యోగులకు వంద శాతం వేరియబుల్ పే ఇవ్వనున్నట్లు తెలిపింది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

TCS Employees : భారతదేశపు అతిపెద్ద టెక్ దిగ్గజం టీసీఎస్ (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్-TCS) కంపెనీ తాజాగా కీలక ప్రకటన చేసింది. ఇటీవల లాభాలను ప్రకటించిన ఈ సంస్థ.. 2022-23 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో 70 శాతం మంది ఉద్యోగులకు వంద శాతం వేరియబుల్ పే ఇవ్వనున్నట్లు తెలిపింది. మిగతా ఉద్యోగులకు వారి బిజినెస్ యూనిట్ పర్ఫార్మెన్స్ (Business Unit Performance) ఆధారంగా వేరియబుల్ పే ఉంటుందని కంపెనీ సోమవారం ప్రకటించింది.

వేరియబుల్ పే అనేది సంస్థ లేదా విభాగం పనితీరు, వృద్ధి ఆధారంగా ఉద్యోగులకు ఎంప్లాయర్ చెల్లించే పరిహారం. ఉద్యోగుల జీతంలో ఇవి ప్రధాన భాగంగా ఉంటాయి. కంపెనీలు ఉద్యోగులకు మూడు నెలలకు ఒకసారి ఈ మొత్తం చెల్లిస్తుంటాయి. ఇతర ఐటీ కంపెనీలు వేరియబుల్ పే మొత్తాన్ని తగ్గించినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో.. టీసీఎస్ తమ నిర్ణయాన్ని ప్రకటించింది.

లాభాల్లో టీసీఎస్ రికార్డు

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) రెండో త్రైమాసికంలో తొలిసారి రూ.10 వేల కోట్ల లాభాల మైలురాయిని దాటింది. జులై నుంచి సెప్టెంబర్ మధ్యలోని సెకండ్ క్వార్టర్‌లో టీసీఎస్‌కు రూ.10,431 కోట్ల నికర ఆదాయం లభించింది. ఈ నేపథ్యంలో కంపెనీ పర్ఫార్మెన్స్ ఆధారంగా 70 శాతం మంది ఉద్యోగులకు వేరియబుల్ పే (Variable Pay) ఇవ్వనున్నట్లు తెలిపింది.

100 శాతం వేరియబుల్ పే

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్, మిలింద్ లక్కడ్ మాట్లాడుతూ.. ‘70 శాతం మంది ఉద్యోగులకు 100 శాతం వేరియబుల్ పే అందుతుంది. మిగతా 30 శాతం మంది ఉద్యోగులకు వారి బిజినెస్ యూనిట్ పర్ఫార్మెన్స్ ఆధారంగా పే ఉంటుంది. రెండో క్వార్టర్ కు సంబంధించి తీసుకున్న నిర్ణయమిది.’ అని చెప్పారు. రెండో త్రైమాసికానికి సంబంధించిన లాభాలను ప్రకటించిన సందర్భంగా మిలింద్ లక్కడ్ వేరియబుల్ పే కు సంబంధించిన నిర్ణయాలను వెల్లడించారు.

Google Login: పాస్‌వర్డ్‌ లేకుండానే గూగుల్ అకౌంట్‌లో లాగిన్... ఈ కొత్త ఫీచర్ మీకు తెలుసా?

 మంచి లాభాలతో ముగిసిన త్రైమాసికం

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్ రాజేష్ గోపీనాథన్ మాట్లాడుతూ.. ‘ప్రస్తుత ఫైనాన్షియల్ ఇయర్‌లో సెకండ్ క్వార్టర్ సంతృప్తికర త్రైమాసికం. ఈ పీరియడ్‌లో రూ.10 వేల కోట్ల నికర లాభం సాధించి మైలురాయిగా నిలిచాం’ అని తెలిపారు. మొదటి త్రైమాసికంలో వేరియబుల్ పే ఆలస్యం చేసిన టీసీఎస్ ఈ సారి మాత్రం ముందుగానే ప్రకటించింది. ఏప్రిల్ నుంచి జూన్ మధ్య ఉండే క్వార్టర్ పేమెంట్ ఆగస్టులో చేసినట్లు కంపెనీ ఇంటర్నల్ ఈ-మెయిల్స్ ద్వారా తెలుస్తోంది. మరో దిగ్గజ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్(Infosys) వేరియబుల్ పేలో 70 శాతం కోత విధించగా, విప్రో కూడా దీనికి సంబంధించిన నిబంధనలను మార్చింది.

First published:

Tags: Employees, TCS

ఉత్తమ కథలు