TCS Recruitment Drive: మ‌హిళ‌ల కోసం టీసీఎస్ ప్ర‌త్యేక రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌.. ద‌రఖాస్తు చేసుకోండి ఇలా

ప్రతీకాత్మక చిత్రం

దేశీయ టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (Tata Consultancy Services) మహిళా నిపుణుల కోసం ప్రత్యే రిక్రూట్ మెంట్ డ్రైవ్ ను నిర్వహించనుంది.  ఈ డ్రైవ్ ద్వారా దేశ వ్యాప్తంగా ఉన్న అనుభజ్ఞులైన‌ మహిళా నిపుణులను  ఎంపిక చేయనుంది. 

  • Share this:
    దేశీయ టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (Tata Consultancy Services) మహిళా నిపుణుల కోసం ప్రత్యే రిక్రూట్ మెంట్ డ్రైవ్ ను నిర్వహించనుంది.  ఈ డ్రైవ్ ద్వారా దేశ వ్యాప్తంగా ఉన్న అనుభజ్ఞులైన‌ మహిళా నిపుణులను  ఎంపిక చేయనుంది.  ఇది మహిళలకు మంచి అవకాశంగా ఐటీ నిపుణులు చెబుతున్నారు.  ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ పేరును రీ బిగిన్(Rebegin)గా నిర్ణయించారు.  ఈ కార్యక్రమంపై టీసీ ఎస్ స్పందిస్తూ రీబిగిన్ చాలా మంచి కార్యక్రమమని అనుభజ్ఞులైన‌, సత్తా ఉన్న మహిళలకు సదవాశం అన్నారు.  టీసీఎస్ నిరంతరం ప్రతిభావంతులను ప్రోత్సహిస్తోందని అన్నానరు. అటువంటి వారిని గుర్తించడంలో టీసీఎస్ ముందుటుందని అన్నారు. ఐటీలో ప్రాథమిక అవగాహన కలిగిన ప్రొఫెషన్ మహిళలను  ఎంపిక చేసి ప్రత్యేక స్ట్రీమ్ లుగా అభివృద్ధి చేస్తారు.

    DRDO Recruitment 2021: డీఆర్‌డీఓలో జూనియ‌ర్ రిసెర్జ్ ఫెలో ఉద్యోగాలు.. జీతం రూ.31,000


    దరఖాస్తు చేసుకోవడానికి అర్హతలు.. 

    టీసీఎస్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న  ఈ డ్రైవ్ కు దరఖాస్తు చేసుకోవాలంటే  గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చేసి ఉండాలి.  అంతే కాకుండా  రెండు లేదా ఐదు సంవత్సరాలు అనుభవం కలిగి ఉండాలి.  ఎంపికైన అభ్యర్థులను దేశంలో  ఎక్కడైన నియమిస్తారు.

    అవసరమైన నైపుణ్యాలు..

    దరఖస్తు చేసుకొనే అభ్యర్థులకు  SQL సర్వర్ DBA, ఆటోమేషన్ టెస్టింగ్, పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ కన్సల్టెంట్, ఆంగ్యులర్ JS, ఒరాకిల్ DBA, సిట్రిక్స్ అడ్మినిస్ట్రేటర్, జావా డెవలపర్, డాట్‌నెట్ డెవలపర్, ఆండ్రాయిడ్ డెవలపర్, IOS డెవలపర్, లైనక్స్ అడ్మినిస్ట్రేటర్, నెట్‌వర్క్ అడ్మిన్, మెయిన్‌ఫ్రేమ్ అడ్మిన్, విండోస్ అడ్మిన్, పైథాన్ డెవలపర్, జావా డెవలపర్, డాట్నెట్ డెవలపర్, ఆండ్రాయిడ్ డెవలపర్ మరియు PL SQL.లో స్కిల్స్ ఉండాలి.

    నియామక ప్రక్రియ

    • ఎంపిక విధానం  ఒకే రౌండ్  ఇంటర్వ్యూ ద్వారా నిర్వహించనున్నారు.

    • ఆసక్తి గల అభ్యర్థులు టీసీఎస్ అధికారిక పోర్టల్  tcs.com లో TCS కెరీర్ లో దరఖాస్తు చేసుకోవాలి.

    • రిజిస్టర్ చేసుకొనేందుకు క్లిక్ చేయండి

    • రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పైన చెప్పిన స్కిల్స్  ఆధారంగా తమ వివరాలను అందించాలి.

    • షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు  ఈమెయిల్ ఐడీకి ఇంటర్వ్యూ వివరాలు పంపబడతాయి.

    Published by:Sharath Chandra
    First published: